బాలీవుడ్ లో గతంలో సినిమాలు చేసిన నటి ఉర్ఫీ జావేద్ నిరంతరం సోషల్ మీడియాలో విభిన్నమైన దుస్తులను ధరించి ఫేమస్ అయ్యింది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లను మించి మరి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ఉర్ఫీ జావేద్  విభిన్నమైన డిజైనర్ దుస్తులలో తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు రోడ్డుమీద కూడా ఇలాంటి దుస్తులలోనే కనిపిస్తూ ట్రాఫిక్ జామ అయ్యేలా చేస్తూ ఉంటుంది. తన దారికి అడ్డు వస్తే సెలబ్రెటీలను కూడా ఎదిరిస్తూ ఉంటుంది ఈ అమ్మడు.



ఇలాంటి వివాదాల వల్ల బాలీవుడ్ లో అవకాశాలు రాకుండా చేశాయి. కొన్ని టీవీ షోలలో ,వెబ్ సిరీస్ లలో మాత్రమే నటించింది. అయితే ఇలాంటి సమయాలలో ఈ అమ్మడుని టాలీవుడ్ కి తీసుకువచ్చే బాధ్యత ఒక దర్శక నిర్మాతలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఉర్ఫీ జావేద్  ను హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఒక డైరెక్టర్, నిర్మాత ముంబైకి వెళ్లి ఆమెను కలిసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఉర్ఫీ జావేద్ ను ఎలాంటి పాత్రలో చూపిస్తారో అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఎలాంటి పాత్రలోనైనా సరే తన అందాల జాతర మాత్రం చేయడానికి వెనకడుగు వేయదు. బయట ఎలాంటి మొహమాటం లేకుండా కనిపిస్తూ ఉన్న ఉర్ఫీ జావేద్  అలాంటిది వెండితెర పైన ఆగుతుందా అంటు పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి టాలీవుడ్ నుంచి వెళ్లిన ఆ దర్శక నిర్మాతలు ఇద్దరు ఎవరు అనే విషయంపై ఆరాధిస్తున్నారు అభిమానులు. ఉర్ఫీ జావేద్  కి గతంలో కూడా బోల్డ్ సన్నివేశాలు నటించిన అనుభవం ఉన్నది. సినిమాలలో ఎలా నటిస్తుందొ ఊహించలేం.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: