మహేష్ బాబు కాంట్రవర్షియాలిటి.  కి చాలా చాలా దూరంగా ఉండే హీరో ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్న అరాకొరా ఏదో ఒక హీరో అడపాదడపా సందర్భాలలో ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు . వాళ్లపై నెగిటివిటీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది . కానీ నెగిటివిటీ లేని హీరో ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఖచ్చితంగా మహేష్ బాబునే.  అంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ..అంత మంచి మనసున్న వ్యక్తి . అయితే ఇప్పుడు మహేష్ బాబు కి ఊహించని  షాక్ తగిలింది . ఎంతలా అంటే వినియోగదారుల కమిషన్ నోటీసులు అందుకునేంత పని చేసుకున్నాడు మహేష్ బాబు.


ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ నటుడు మహేష్ బాబు తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది . దీంతో ఘట్టమనేని అభిమానులు షాక్ అయిపోతున్నారు. మెస్సెర్స్ సాయి సూర్య డెవలప్ సంస్థను మొదటి ప్రతివాదిగా ..అదేవిధంగా యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తను రెండో ప్రతివాదిగా .. ఇక ప్రచారకర్త సినీనటు వంటి మహేష్ బాబు మూడో ప్రతి వాదిగా చేర్చుతూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు దాఖలయింది . ఓ వైద్యురాలు ఈ కేసు వేసినట్లు తెలుస్తుంది . మరో వ్యక్తి రెండో ప్రతివాది మాటలన్నీ బాలాపూర్ గ్రామంలో చెరో ప్లాట్ కొనడానికి దాదాపు 34 లక్షల 80 వేలు చెల్లించినట్లు తెలుస్తుంది .



అన్ని అనుమతులు ఉన్నాయని.. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులమై డబ్బు చెల్లించినట్టు ఫిర్యాదుదారురాలు పేర్కొంది . దీంతో మహేష్ బాబు ఊహించని చిక్కుల్లో ఇరుకున్నట్లైంది .  లేఅవుట్ లేదు అని తెలుసుకుని డబ్బు తిరిగి ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వమంటున్నారు అని..  రెండో ప్రతివాది అతి కష్టం మీద కేవలం 15 లక్షల మాత్రమే వాయిదాలలో ఇచ్చారు అని చెప్పుకు వచ్చింది.  అనంతరం ఆలస్యం చేస్తూ ముఖం చాటేఅయడంతో..మిగతా డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారులు కమిషన్ను ఆశ్రయించారు.  దీంతో ఇష్యూ పెద్దదిగా మారిపోయింది . ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేసింది . ఈ ఇష్యూలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా ఉండడం ఇప్పుడు ఆయనకు బిగ్ నెగిటివ్గా మారింది . అసలు ఎందుకు మహేష్ బాబు ఇలాంటి పనులు చేస్తున్నాడు.  ఊహించని చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు  అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. కాగా గతంలో రియల్ ఎస్టేట్ మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ అండ్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ సైతం మహేష్ బాబుకి నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: