సాధారణంగా ఇండస్ట్రీలో నటించే హీరో హీరోయిన్లు ముఖానికి మేకప్ వేసుకోక తప్పదు . అది కంపల్సరీ . ఎలాంటి హీరో అయినా ఎలాంటి హీరోయిన్ అయినా ముఖానికి మేకప్ వేసుకోవాల్సిందే . అయితే కొంతమంది మాత్రం మేకప్ వేసుకోకుండానే తెరపై కనిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు.  అలా నటించిన వాళ్లు కూడా ఉన్నారు.  కానీ ప్రతి ఒక్క స్టార్ హీరో హీరోయిన్ ఏదో ఒక సందర్భంలో మాత్రమే అలా మేకప్ చేసుకోకుండా నటిస్తూ ఉంటారు.  అన్ని సందర్భాలలో ముఖానికి రంగులు పూసుకుని నటించాల్సిన పరిస్థితి ఉంటుంది .


సినిమా అంటే నే గ్లామరస్ ప్రపంచం . మరి గ్లామర్ గా కనిపించకపోతే ఎలా? అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్ మాత్రం ఓ సినిమా కోసం అసలు మేకప్ నే వేసుకోలేదు . దీనికి సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటిది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాగా  జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఒక సినిమాలో మాత్రమే ఫేస్ కి మేకప్ వేసుకోకుండా  నటించారు.



దానికి సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఆ సినిమా మరేంటో కాదు "నరసింహుడు".  సమీరా రెడ్డి హీరోయిన్ గా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా  అనుకున్నంత హిట్ కాలేదు . మొత్తం సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కింది . ఈ సినిమాలో చాలా రిస్కీ పాయింట్స్ ఫేస్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్.  ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా సైలెంట్ గా అసలు నోట్లో నుంచి ఒక్క మాట కూడా  మాట్లాడకుండానే సినిమాని చూపించేస్తారు.  ఈ సినిమాలో అమీషా పటేల్ కూడా నటించింది. కాగా ఈ సినిమాలో నాచురల్ లుక్స్ లో కనిపించడానికి ఎన్టీఆర్ అసలు మేకప్ నే వేసుకోలేదట . అంతేకాదు కేవలం పాటలకు మినహా సినిమా కథ మొత్తం కూడా ఆయన అలాగనే నటించేసాడట . అప్పట్లో ఒక స్టార్ హీరో మేకప్ వేసుకోకుండా నటించడం అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది.  అయినా సరే ఈ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు . జూనియర్ ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డ కూడా కధకు నెగిటివ్ మార్కులు పడ్డాయ్. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ పలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ముందుకు వెళుతున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: