"నితిన్".. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో . ఒకప్పుడు ఆయన నటించే సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టేశాయ్. ఎంతలా అంటే నితిన్ సినిమాలకు భయపడి ఆ స్టార్స్ తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది . ఏ సినిమా చేసిన సరే బాక్సాఫీస్ వద్దగా ఫ్లాప్ గా మారిపోతుంది . రీసెంట్ గానే "తమ్ముడు" అనే సినిమాతో అభిమానులను పలకరించారు . ఈ సినిమా అభిమానులు అంచనాలను అందుకోలేకపోయింది .


కామెడీ సీన్స్.. స్టోరీ అభిమానుల రేంజ్ ను టచ్ చేయలేకపోయింది . మరీ ముఖ్యంగా థియేటర్లో సినిమా ముందుకు వెళ్తున్న మూమెంట్లో నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది అని ఈజీగా చెప్పేస్తున్నారు . అంతలా ప్రిడక్టబుల్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి . అదే సినిమాకి బిగ్ డిజాస్టర్ గా మారింది. అయితే ఎంతసేపు ఫ్యామిలీ స్టోరీ సినిమాలని చూస్ చేసుకుంటూ ఉంటే కష్టమని మిగతా జోనర్ లో కూడా సినిమాలు చూస్ చేసుకోవాలి అంటూ చాలామంది డైరెక్టర్స్ చాలామంది ఫ్యాన్ సజెషన్స్ ఇస్తున్నారు.  ఇప్పుడు అదే రూట్లో ముందుకు వెళ్తున్నాడు హీరో నితిన్.



తనలోని మాస్ యాంగిల్ లో బయట పెట్టడానికి ఆయన మాస్ డైరెక్టర్ తో మూవీకి కమిట్ అయ్యాడంటూ తెరపైకి ఓ న్యూస్ వచ్చింది . ఆ డైరెక్టర్ మరెవరో  కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పాపులారిటి సంపాదించుకున్న బోయపాటి శ్రీను . ప్రజెంట్ బాలయ్య తో అఖండ 2 సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా కంప్లీట్ అయిపోగానే నాగచైతన్యతో ఒక సినిమా చేయాలి అని అనుకున్నాడట . కానీ నాగచైతన్య వేరే డైరెక్టర్స్ కు కమిట్ అయిపోయాడు . ఇప్పుడు ఆ స్టోరీని నితిన్ తో చేయబోతున్నాడట . ఈ సినిమా మొత్తం కూడా ఫుల్ యాక్షన్.. మాస్ ఫ్యామిలీ సెంటిమెంట్.. ఆధారంగా తెరకెక్కబోతుంది అంటూ ఓ  న్యూస్ బయటకు వచ్చింది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో నితిన్ సినిమా రాబోతుంది అన్న వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. నితిన్ ఎప్పుడెప్పుడు హిట్ కొడతాడా అంటూ ఫ్యాన్స్ వేయి కళ్ళతో వెయిటింగ్. బోయపాటి దర్శకత్వంలో అయినా హిట్ కొడితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: