టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎప్పుడూ కూడా చాలా న్యాచురల్ గా ఉండే పాత్రలోనే నటిస్తూ ఉండేవారు. ఈమధ్య శర్వానంద్ నటించిన చిత్రాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలో నిరాశనే ఎదుర్కొంటున్నాయి. శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు బారీ ప్లాపులు అయ్యాయి. కేవలం ఒకే ఒక జీవితం సినిమా తో పరవాలేదు అనిపించకున్న  శర్వానంద్  ఆ తర్వాత మనమే సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాతో బయ్యర్లకు భారీగా నష్టాలనే మిగిల్చాయి.


దీంతో ఒక్కసారిగా శర్వానంద్ మార్కెట్ కూడా ప్రస్తుతం డౌన్ అయినట్టుగా కనిపిస్తోంది. నాన్  థియేట్రికల్ డీల్స్ కూడా నిర్మాతలకు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఇలాంటి సమయంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే శర్వానంద్ నటించిన మూడు చిత్రాలు సినిమా షూటింగ్ సెట్లో ఉన్నప్పటికీ ఆగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సామజవరగమన డైరెక్టర్ అబ్బురాజు డైరెక్షన్లో నారి నారి నడుమము మురారి.. అలాగే మరొక డైరెక్టర్ అభిలాష్ రెడ్డి డైరెక్షన్లో తన 36వ సినిమా ఎప్పుడో మొదలైన ఇప్పటికీ పూర్తికాలేదు.


ఇందుకు కారణం సినిమా బడ్జెట్లో పెరిగిపోవడమే కాకుండా శర్వానంద్  మార్కెట్ కూడా డౌన్లోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ల భోగి అనే చిత్రాన్ని పాణి ఇండియా లెవెల్లో మొదలుపెట్టారు. ఈ చిత్రానికి సంబంధించి రెండు షెడ్యూల్ ను కూడా జరపగా ఈ ప్రాజెక్టు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వచ్చిన భైరవం సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన కేకే. రాధ మోహన్ భోగి చిత్రాన్ని హోల్డ్ లో పెట్టించినట్లు సమాచారం. మరి శర్వానంద్ సినిమాల ను ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియక అభిమానులు సతమతమవుతున్నారు. మరి రెమ్యూనరేషన్ విషయంలో హీరో శర్వానంద్ తగ్గి నిర్మాతలను సేఫ్  చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: