
ఒగ్గు కళాకారుల సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ బ్రహ్మాండ సినిమాను రూపొందించారు. మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో దాసరి సురేష్, శ్రీమతి దాసరి మమత నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. అయితే ఇంతలోనే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బ్రహ్మాండ చిత్ర దర్శకుడు ఎస్. రాంబాబు మృతి చెందారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ కంప్లీట్ కావడంతో ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రబృందంతో కలిసి డైరెక్టర్ రాంబాబు కూడా బ్రహ్మాండ మూవీ ప్రివ్యూ చేస్తున్నారు. ఇంటర్వెల్‌లో రాంబాబు వాష్ రూమ్‌కు వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలారు. సినిమా మొత్తం పూరైనా డైరెక్టర్ రాకపోవడంతో మిగతా టీమ్ ఆయన్ను వెతకగా.. వాష్ రూమ్‌లో పడి ఉన్నారు. దాంతో రాంబాబును హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్ళినా... అప్పటికే ఆయన ప్రాణం విడిచినట్టు వైద్యులు తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ తో రాంబాబు కన్నుమూశారని తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన డెబ్యూ ఫిల్మ్ ప్రివ్యూ చూస్తూ రాంబాబు హఠాన్మరణ చెందడం అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు