
సంక్రాంతికి జనవరి 14 విడుదలైన కృష్ణ నటించిన "అగ్నిపర్వతం" సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ లని ఓ రేంజ్ లో ఊపేసింది. అప్పుడు కృష్ణ స్టార్ డమ్ పీక్స్ లో ఉండింది . మరీ ముఖ్యంగా ఆయన మాస్ యాక్షన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అలా ఉన్నయ్. ఆయన ఏ సినిమాలలో కనిపిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ .. కాసుల వర్షం కురిపించేది . అలాంటి సమయంలో వచ్చిన చిత్రమే "అగ్నిపర్వతం". సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన అగ్నిపర్వతం సినిమా 1985 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది . ఈ సినిమాకి కే రాఘవేంద్రరావు గారి దర్శకత్వం వహించగా అశ్వినీ దత్ నిర్మించారు . భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది .
మరి ముఖ్యంగా ఈ సినిమాలో కృష్ణ చెప్పే డైలాగ్స్ ప్రతిదీ కూడా హైలెట్గా మారింది . థియేటర్లో జనాలు పూనకాలతో ఊగిపోయారు. ఆ లెవెల్ లో కిక్ ఎక్కించింది ఈ సినిమా . ఈ సినిమా ఎనిమిది సెంటర్లలో 125 రోజులు ఆడింది . అయితే ఈ సినిమాకి పోటీగా వచ్చిన చిరంజీవి "చట్టంతో పోరాటం" మాత్రం అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేకపోయింది . అప్పటికే ఖైదీ సినిమాతో స్టార్ డమ్ అందుకున్న చిరంజీవి ఆ తర్వాత వరుస సక్సెస్ లు సాధించి జోరు మీద ఉన్నాడు . ఎన్టీఆర్ రాజకీయాలకు వెళ్లడంతో చిరంజీవి ఆ స్ధానాని భర్తీ చేసేస్తాడు అని అంతా భావించారు . ఆ సమయంలో కృష్ణకి పోటీగా చట్టంతో పోరాటం సినిమాని రిలీజ్ చేశాడు చిరంజీవి . అయితే ఈ సినిమా విషయంలో బోల్తా కొట్టాడు . ఈ మూవీ ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది . మెగా ఫాన్స్ కూడా డీలా పడిపోయారు. సంక్రాంతి బరిలో కృష్ణ ముందు చిరు పోరాటం ఫలించలేకపోయింది . ఆ విధంగా చిరంజీవికి కోలుకోలేని షాక్ ఇచ్చాడు కృష్ణ . ఈ కాంపిటీషన్ ప్రతి సంక్రాంతి సందర్భంలో జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు..!!