సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు మ్యాగీ చేసేసినంత ఈజీగా లవ్ లో పడిపోవడం బ్రేకప్ లు చెప్పుకోవడం చేస్తూ ఉంటారు.ఎంత తొందరగా ప్రేమలో పడిపోతారో అంతే తొందరగా బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ బ్రేకప్ బాధ నుండి కూడా తొందరగానే బయటపడతారు.ఇక మరి కొంతమందేమో చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్లి పోతారు. ఇదంతా పక్కన పెడితే గత కొద్ది రోజులుగా తమన్నా బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే.తమన్నా విజయ్ వర్మతో దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ చేసి సడన్గా ఈ మధ్యనే బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఇక వీరిద్దరూ బ్రేకప్ ని ఎక్కడ కూడా కన్ఫామ్ చేయకపోయినప్పటికీ వీరి మధ్య నిజంగానే బ్రేకప్ జరిగింది అని అర్థమవుతుంది. 

ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా తమన్నా విజయ్ వర్మలు కలిసి కనిపించడం లేదు.దీంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్టు అందరికీ అర్థమైంది.ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా తమన్నా భాటియా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ మళ్ళీ తమన్నా ప్రేమలో పడిందా అనే ఊహాగానులకు తెర లేపింది.మరి ఇంతకీ తమన్నా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఆ పోస్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది హీరోయిన్లు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని విషయాలను సోషల్ మీడియా పోస్టుల ద్వారా పరోక్షంగా బయట పెడుతూ ఉంటారు. అలా తాజాగా తమన్నా తన సోషల్ మీడియా ఖాతాలో బ్లాక్,గ్రే కలర్ల కలయిక గురించి మాట్లాడుతూ.. నేను వేసుకున్న గ్రే,బ్లాక్ రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన రంగులు.. కానీ ఇవి రెండూ కలవాలని రాసుంది కలిసాయి.

 అయితే బ్లాక్, గ్రే రెండు రంగులు మగతనమైన మగ, ఆడ స్వభావం మధ్య సమతుల్యతను ఏర్పరుస్తాయి.అయితే ఈ రెండు రంగులు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. విభేదాలు అనేవి సంభాషణ కాదు మన అభిప్రాయం మాత్రమే అంటూ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది.అయితే తమన్నా పెట్టింది రంగుల గురించే కానీ దాంట్లో అర్థం వేరే ఉంది.తమన్నా పెట్టిన దాన్ని నిశితంగా గమనిస్తే ఆమె మళ్ళీ ప్రేమలో పడిపోయిందని, ఇప్పుడు విజయ్ వర్మ కంటే చాకు లాంటి కుర్రాన్ని పట్టే ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.ఏది ఏమైనప్పటికి తమన్నా తాజాగా రెండు రంగులను ఉద్దేశించి పరోక్షంగా రిలేషన్ గురించి పెట్టిన పోస్ట్ మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: