
విజయ్ 69 – జననాయకుడు లో కీలక పాత్ర ! మమిత ప్రస్తుతం దళపతి విజయ్ చివరి చిత్రం జననాయకుడులో కీలక పాత్ర పోషిస్తోంది. ఏకంగా విజయ్ 69వ చిత్రంలో స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఇది ఆమె కెరీర్‌కి గోల్డెన్ టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో సందేహం లేదు.
టాప్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు :
ధనుష్ , సూర్య వంటి అగ్ర హీరోల సినిమాల్లో మమిత నటిస్తున్నట్లు సమాచారం .
నివిన్ పౌలీ సినిమాలో లీడ్ హీరోయిన్ గా ఎంపికైంది .
యంగ్ స్టార్స్ ప్రదీప్ రంగనాథన్ , సంగీత్ ప్రతాప్ చిత్రాల్లోనూ ఛాన్సులు పట్టేసింది .
ప్రేమలు సీక్వెల్ కూడా ప్రస్తుతం ప్రీ - ప్రొడక్షన్ స్టేజిలో ఉంది .
ఇండస్ట్రీ లో ‘టాప్ రైజింగ్ స్టార్’ గా మమిత ! ఇలా ఒకే ఒక్క హిట్ తో చేతినిండా సినిమాల తో టాలీవుడ్ , కోలీవుడ్ , మలయాళం ఇండస్ట్రీల్లో బిజీగా మారిన మమిత , త్వరలోనే టాప్ 5 హీరోయిన్‌ల లో ఒకరిగా నిలవనుంద ని విశ్లేషకుల అభిప్రాయం . నాచురల్ అటిట్యూడ్ , ఫ్రెష్ ప్రెజెన్స్ ఆమె ను ఇండస్ట్రీ లో ఓ హాట్ ఫేవరెట్ గా మార్చాయి .