తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించారు. పవన్ నటించిన సినిమాలలో ఎన్నో క్లాసిక్ విజయాలను అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆయన నటించిన సినిమాలకు మాత్రమే కాకుండా ఆయన సినిమా టైటిల్స్ కు కూడా అద్భుతమైన క్రేజ్ ఉంది. దానితో ఎంతో మంది ఈ తరం హీరోలు పవన్ కళ్యాణ్ హీరో గా రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న సినిమా టైటిల్స్ ను తమ సినిమాలకు పెట్టుకుంటూ వస్తున్నారు.

కానీ పవన్ సినిమా టైటిల్స్ పెట్టుకుంటున్నారు కానీ పవన్ సినిమాలు ఏ స్థాయి విజయాలను అందుకున్నాయో ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా సినిమాలు వెనకబడి పోయాయి. ఒకే ఒక హీరో మాత్రం పవన్ సినిమా టైటిల్ను పెట్టుకొని మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.  ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు పవన్ కళ్యాణ్ సోదరుడి కుమారుడు అయినటువంటి వరుణ్ తేజ్. ఈయన పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన తొలిప్రేమ సినిమా టైటిల్ తో రూపొందిన సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇక కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఖుషి టైటిల్ తో రూపొందిన ఓ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే ప్రదీప్ మాచిరాజు "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈయనకు ఈ సినిమా ద్వారా అపజయం దక్కింది. తాజాగా నితిన్ "తమ్ముడు" అనే టైటిల్ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: