
ఆ తర్వాత రోజుల్లో రవి రాథోడ్ చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగించాడు. రవి రాథోడ్ మద్యానికి బానిసై మందు లేకపోతే బ్రతకలేను అన్నంత దుస్థితికి చేరుకున్నాడు. ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో తనే చెప్పుకొచ్చాడు. లారెన్స్ ను మళ్ళీ కలవాలనుకుంటే భయంగా ఉందని గుటకలు మింగాడు. స్కూల్ నుంచి ఎందుకు పారిపోయావంటూ తిడతారని కొడతారని భయంతో వెనుకడుగు వేశానని రవి రాథోడ్ అన్నారు.
అయితే తాను తిట్టనని కొట్టనని రవి రాథోడ్ ఒకసారి వచ్చి తనను కలవాలని లారెన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. లారెన్స్ పోస్ట్ చూసి ధైర్యంగా రవి రాథోడ్ ఆయనను కలవగా లారెన్స్ రవి రాథోడ్ కు 50,000 రూపాయల ఆర్ధిక సహాయం చేశారు. లారెన్స్ ఆల్కహాల్ అడిక్షన్ తగ్గించడానికి నాకు అన్ని పరీక్షలు చేయించారని మెడిసిన్స్ ఇచ్చారని అయితే మాస్టర్ నన్ను చూడగానే ఒక మాట అన్నారని చెప్పుకొచ్చారు.
తాగేవాళ్లను నేను సపోర్ట్ చేయనని ఏదో నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసని సపోర్ట్ చేస్తున్నానని లారెన్స్ చెప్పారని నన్ను చెన్నైలో ఉండమని చెప్పినా నా స్నేహితులు ఉన్నారని హైదరాబాద్ కు వచ్చేశానని ఆయన తెలిపారు. రవి రాథోడ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రవి రాథోడ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.