లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు ఇక లేరు అన్న విషయాన్ని సినీ లోకం జీర్ణించుకోలేకపోతోంది. విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ గా నిలిచిన కోట వృద్ధాప్య సమస్యలతో బాధ‌ప‌డుతూ ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన అంత్యక్రియలు మహా ప్రస్థానంలో ముగిసాయి. కోట శ్రీనివాసరావును చివరి చూపు చూసుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా త‌ర‌లివచ్చారు. ఆయ‌న భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు తమ్ముడు కోటా శంకర్ రావు కూడా నిన్న కనిపించారు.


కోట శ్రీనివాసరావు తమ్ముడు కూడా ప్రముఖ నటుడే అన్న సంగతి చాలా మందికి తెలియదు. నటనలో అన్నయ్యకు సాటి.. నాటకంలో మేటి.. ఏ పాత్రకైనా సరిపోయే రూపం.. సునాయాసనంగా క్లిష్టమైన డైలాగులను చెప్పగలిగే వ్యాఖ్యానం కోట  శంకర్ రావు సొంతం. కోట శ్రీనివాసరావు అటు వెండితెర‌ను ఏలితే.. ఆయ‌న‌ తమ్ముడు కోట  శంకర్ రావు బుల్లితెరను ఏలారు. ఇద్ద‌రూ విలనిజాన్ని పండిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇండస్ట్రీలోకి రాకముందు కోట శంకర్ రావు స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా 30 ఏళ్లు పనిచేశారు. 1965లో నాటక రంగంలోకి ప్రవేశించారు. ఆ అనుభవంతోనే సినిమాల్లో అవకాశం దక్కించుకున్నారు. 1986లో `నాకూ పెళ్లి కావాలి` మూవీతో శంకర్ రావు తొలిసారి వెండితెరపై మెరిశారు. ఆ తర్వాత దాదాపు 80 సినిమాల్లో నటించారు. `అంకురం`, `సూత్రధారులు`, `హలో బ్రదర్` వంటి చిత్రాలు ఆయనకు మంచిది పేరు తెచ్చిపెట్టాయి. సినిమాల కన్నా ముందు శంకర్ రావు సీరియల్స్ లో యాక్ట్ చేశారు. 50 కి పైగా సీరియల్స్ లో నటించిన అనుభవం శంక‌ర్ రావుకు ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: