
రాత్రి 7 గంటలకు డిన్నర్.. ఆ తర్వాత మళ్లీ ఎలాంటివి కూడా నాగార్జున తీసుకోడట. ఈ డైట్ ని సుమారుగా 35 ఏళ్ల నుంచి పాటిస్తూ ఉన్నారట. ఎక్కడ ఉన్న ఏం చేస్తున్నా.. సరే కచ్చితంగా రాత్రి 7 గంటలకు డిన్నర్ ని నాగార్జున పూర్తి చేస్తారట. ఈ డిన్నర్ లో నాగార్జున సాలాడ్స్ తో పాటుగా చేపలు చికెన్ వంటివి తింటారట. అయితే వీటిని తినడం ఎంత ముఖ్యమో .. ఏ వేళలో తింటున్నామనేది కూడా చాలా ముఖ్యమని నాగార్జున తెలియజేశారు. ఇదే విషయాన్ని ట్రైనర్స్ కూడా ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.
రాత్రి సమయాలలో వీలైనంత త్వరగా భోజనం ముగించేసి పడుకోవడం చాలా ఉత్తమమని అందుకే నాగార్జున కూడా వాటిని ఫాలో అవుతున్నారు. ఇక డిన్నర్ చేసిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేసి మరి నాగార్జున నిద్రపోతారట. అందుకే తాను ఇంత ఫిట్నెస్ గా యంగ్ గా కనిపిస్తూ ఉంటానని తెలియజేశారు. నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఇటీవలే కుబేర సినిమాలో కనిపించిన నాగార్జున ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నారు. అలాగే డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న కూలి చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. తన 100 వ చిత్రాన్ని కూడా తమిళ డైరెక్టర్ లో ప్లాన్ చేస్తున్నారు.