
అమెరికా లో మాత్రమే $122 మిలియన్ , ఇండియాలో తొలి 4 రోజుల్లో ₹28.25 కోట్లు నెట్ కలెక్షన్, తెలుగు వెర్షన్ కలెక్షన్ – 3 రోజుల్లో ₹1.1 కోట్లు, పూర్తి బడ్జెట్ (విపణిలో ప్రచారం కలిపి): $325 మిలియన్.. బ్రేక్‌ఈవెన్ కావాలంటే: కనీసం $550 మిలియన్ వసూలు కావాలి .. మాన్ ఆఫ్ స్టీల్‌ను దాటేసిన ‘కొత్త’ సూపర్‌మ్యాన్ .. 2013లో హెన్రీ కేవిల్ హీరోగా వచ్చిన మాన్ ఆఫ్ స్టీల్ తొలి వారం $200 మిలియన్ వసూలు చేసింది. అయితే జేమ్స్ గన్ వెర్షన్ అదే రేంజ్‌లో స్టార్ట్ అయ్యి దాన్ని క్రాస్ చేసి, అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన టాప్ సూపర్‌మ్యాన్ మూవీగా నిలిచింది . మారిన ట్రెండ్ – మళ్లీ నమ్మకం పుట్టించిన సూపర్‌మ్యాన్ ... గత దశాబ్దంలో డీసీఈయూ (DCEU) సినిమాలపై ప్రేక్షకుల నమ్మకం తగ్గిపోయింది. షాజామ్, ఫ్లాష్, బ్లాక్ అడామ్ వంటి సినిమాలు భారీగా ఫెయిలయ్యాయి. ఈ సమయంలో సూపర్‌మ్యాన్‌ను తిరిగి లాంచ్ చేయడమంటే పెద్ద రిస్క్. కానీ జేమ్స్ గన్ విజన్ వర్క్ అయింది.
ఇండియన్ బాక్సాఫీస్ పరిస్థితి .. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌పై కూడా హాలీవుడ్ సినిమాలే రాజ్యమేలుతున్నాయి. ఉదాహరణకు: జురాసిక్ వరల్డ్ రీబర్త్ – ₹520 కోట్లు (Worldwide), F1 (బ్రాడ్ పిట్) – ₹393 కోట్లు, సిన్నర్స్ (Michael B Jordan) – క్రాస్ చేసి పోయింది .. బాలీవుడ్ సినిమాల కలెక్షన్లు తక్కువగా ఉండటం గమనార్హం .. సూపర్‌మ్యాన్ (2025) సినిమా విజయం ద్వారా డీసీ స్టూడియోస్‌కు సరికొత్త శకం ప్రారంభమైంది. జేమ్స్ గన్ తీయబోయే మరో సినిమాలకు ఇది అద్భుతమైన లాంచ్ పాడ్‌గా మారింది. ఇక పై సూపర్ హీరోల సినిమాలు మళ్లీ బాక్సాఫీస్‌ను హడావిడిగా మార్చేలా కనిపిస్తున్నాయి.