పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడం చేత అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృంద ప్రమోషన్ కూడా వేగవంతంగా చేస్తోంది. అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతి కృష్ణ, నిర్మాతలు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు.



అయితే తాజాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో హరిహర వీరమల్లు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. అలాగే సినిమాకి సంబంధించి బడ్జెట్ విషయాలను కూడా రివీల్ చేయడం జరిగింది. హరిహర వీరమల్లు సినిమాకి సుమారుగా రూ.300 కోట్ల రూపాయల ఖర్చు అయ్యిందని పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ కు ఎంత ఖర్చు చేసినా తక్కువే అంటూ తెలియజేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గతంలో సినిమా బడ్జెట్ విషయంలో పలు రకాల రూమర్స్ వినిపించాయి. వాటికి చెక్ పెట్టారు.


హరిహర వీరమల్లు చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే సునీల్, నాజర్ తదితర నటినటులు కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలు కూడా సినిమాకి ప్లస్ గా మారాయి. ముఖ్యంగా ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమా పైన అంచనాలను మరింత పెంచేసినట్లు కనిపిస్తోంది. హరిహర వీరమల్లు 2 సినిమా పైన కూడా మరింత అంచనాలు పెంచే విధంగా చిత్ర బృందం తెలియజేస్తోంది. మరి మొదటి భాగానికి సుమారుగా ఐదేళ్ల సమయం పట్టింది. మరి రెండవ భాగానికి ఎన్నేళ్ల సమయంపడుతుందో అంటూ అభిమానులు తెలుపుతున్నారు. ఇప్పటికే కొంతమేరకు షూటింగ్ పూర్తి అయినట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: