
ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సిందే అన్షు గురించే. `మన్మధుడు` సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ అందాల భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు బై చెప్పి విదేశాలకు వెళ్ళిపోయింది. ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అన్షు మనసు మళ్ళీ యాక్టింగ్ పై మళ్ళింది. ఇటీవల `మజాకా` మూవీతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. ఈ సినిమాలో సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలు పోషించగా.. రావు రమేష్ కి జోడిగా అన్షు నటించింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడక పోవడంతో.. అన్షుకు సరైన రీఎంట్రీ అనేది లభించలేదు.
రీసెంట్ గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ అమెరికా నుంచి వచ్చి మరీ తెలుగు ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. దాదాపు 18 ఏళ్ల గ్యాన్ అనంతరం నితిన్ హీరోగా తెరకెక్కిన `తమ్ముడు` చిత్రంతో వెండితెరపై అడుగు పెట్టింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో తమ్ముడుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లయకు ఊహించని దెబ్బ తగలింది.
ఇక తాజాగా వీరి చెంత జెనీలియా కూడా చేరిందని అంటున్నారు. 13 ఏళ్ల విరామం తర్వాత తెలుగులో జెనీలియా చేసిన చిత్రం `జూనియర్`. గాలి కిరీటి రెడ్డికి డెబ్యూ ఫిల్మ్ ఇది. ఇందులో కిరీటి సోదరిగా జెనీలియా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పటికీ.. అక్కాతమ్ముడు మధ్య సెంటిమెంట్ ఔవర్కోట్ కాలేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కిరీటికి మంచి మార్కులే పడుతున్న.. జెనీలియాకు మాత్రం రావాల్సిన పేరు రాలేదు.