
ఒక్కొక్కొ మెట్టు ఎదుగుతూ ఎవరు టచ్ చేయలేని స్ధాయికి ప్రభాస్ ఎదిగిపోయాడు. కాగా ప్రభాస్ నటిస్తున్న వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్ లల్లో "ఫౌజి" కూడా ఒకటి. ఇది చాలా స్పెషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు డైరెక్టేర్ హనురాఘవపూడి . ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ఇమ్మాన్వీ ని తీసుకున్నాడు. ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అంటూ ఇప్పటికే మేకర్స్ చాలా సంధర్భాలల్లో తెలియజేశారు. కాగా "వర్షం" సినిమాకి ప్రభాస్ ఎంత ఫిట్ గా ఎంత నాటిగా ..ఎంత యాక్టివ్ గా కనిపించారో సేమ్ .. అదే విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నాడట హనురాఘవపూడి.
మరీ ముఖ్యంగా వర్షం సినిమాలో అందరికి ప్రభాస్ క్యారెక్టర్ బాగా నచ్చింది. మంచిగా ఉన్నచోట మంచిగా ఉండడం.. చెడుగా ఉన్న వాళ్లకి చెడుగా మారడం .. కోపంగా ప్రభాస్ తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు వర్షం సినిమా కథనే మార్చేశాయి. అదే విధంగా "ఫౌజి" సినిమాలోని క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట . ప్రేమ కోసం ఏమైనా చేసే ఒక వ్యక్తి తెగిస్తే ఎలా ఉంటుంది..?? అనేదే ఈ సినిమా స్టోరీ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీను బట్టి చూస్తే మనం వర్షం సినిమాలో ప్రభాస్ ని ఏ గెటప్ లో చూసామో.. మళ్ళీ అదే కోపం - ప్రేమ - ఉద్రేకం అన్ని ఎమోషన్స్ కలగలసిన క్యారెక్టర్ లో ఈ సినిమాలో మనం ప్రభాస్ ని చూడొచ్చు . ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్ . ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటూ ఆశ పడుతున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది..???