- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

అధర్వ, నిమిషా సాజయన్ హీరో , హీరోయిన్‌లుగా , నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో , నిర్మాత సురేష్ కొండేటి మరియు సహ నిర్మాతలు గా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం "మై బేబీ" ఈ నెల 18 జూలై 2025న విడుదలైంది. విడుదలై నప్పటి నుండి రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ,విడుదలైన మూడు రోజులకే రికార్డు స్థాయిలో 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసి , ఇటీవల విడుదలైన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది.థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరికీ ఒక మంచి అనుభూతిని కలిగిస్తోంది అని తెలిపారు . ఈ సినిమా అమ్మ తాలూకు ప్రేమను , నాన్న తాలూకు బాధ్యతను కలిపిన కథగా మంచి పేరు తెచ్చుకుంది ..


కొన్ని  రోజుల విరామం తర్వాత మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఎస్.కె. పిక్చర్స్, ఏ మాత్రం తన బ్రాండ్ ఇమేజ్‌ను తగ్గించుకోలేదు అని మళ్లీ నిరూపించుకుంది. ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే విషయం మరోసారి రుజువైంది. ఇంతటి గొప్ప విజయం ఇచ్చినందుకు, మళ్లీ మా ప్రయాణాన్ని ప్రారంభించే భరోసా కలిగించినందుకు తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు.


వాట్సాప్ నెంబ‌ర్ కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి . . .

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: