మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె చాలా కాలం క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఈమె తెలుగులో మొదటి విజయాన్ని హ్యాపీ డేస్ ద్వారా అందుకుంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం , ఇందలో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కడం మొదలు అయింది.

ఈమె నటించిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడం , అందులో ఈమె తన నటనతో , అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చాలా తక్కువ కాలం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగులో ఓ వైపు సినిమాలు చేస్తూనే ఈమె అనేక భాషల సినిమాల్లో కూడా నటించి అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. తమన్నా కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో మాత్రమే కాకుండా అనేక సినిమాల్లో ఐటమ్ సాంగ్లలో కూడా నటించింది. తమన్నా ఇప్పటివరకు ఎన్నో ఐటమ్ సాంగ్లలో నటించి తన అందంతో , డాన్స్ తో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈమె ఐటెం సాంగ్స్ సంఖ్యను మరింతగా పెంచేసింది. తాజాగా ఈమె చేసిన ఐటమ్ సాంగ్స్ అదిరిపోయే రేంజ్ లో పాపులర్ కూడా అయ్యాయి.

దానితో ఈమెతో ఐటమ్ సాంగ్స్ చేయించడానికి దర్శక , నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈమె ఓ సినిమాలో చేసిన మూడు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా మూడు కోట్ల రూపాయలు అందుకున్నట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ ఐటెం సాంగ్ చేసింది అంటే ఆ సినిమాపై కూడా క్రేజ్ భారీగా పెరిగిపోతూ వస్తుండడంతో నిర్మాతలు కూడా ఈమెకు అడిగినంత ఇస్తూ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: