తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ కలిగిన స్టార్ హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ , మెగాస్టార్ చిరంజీవి కూడా ఉంటారు. వీరిద్దరూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే కృష్ణ గారు కొంత కాలం క్రితమే మరణించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ కృష్ణ , మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డారు. అందులో కృష్ణ పై చిరంజీవి పై చేయి సాధించాడు. మరి ఏ సినిమాలతో వీరిద్దరూ తలపడ్డారు. ఆ సినిమాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా 1991 మే 9 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్గా నటించగా. ... విజయ భాపినీడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కంటే దాదాపు నాలుగు రోజుల ముందు కృష్ణ హీరోగా రూపొందిన ఇంద్ర భవనం సినిమా విడుదల అయింది. ఇక ఈ సినిమా విడుదల అయిన నాలుగు రోజులకే విడుదల అయిన గ్యాంగ్ లీడర్ మూవీ కి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఇంద్ర భవనం సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది. దానితో గ్యాంగ్ లీడర్ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోగా , ఇంద్ర భవనం సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే గ్యాంగ్ లీడర్ సినిమా అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్  గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: