
ఇదే కాకుండా, వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌ను మళ్లీ రిపీట్ చేస్తూ బాబీ దర్శకత్వంలో మరో మాస్ ఎంటర్‌టైనర్ కోసం చిరు ఓకే చెప్పేశాడు. ఆ ప్రాజెక్ట్‌ని కూడా బర్త్‌డే రోజే అధికారికంగా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. అంతే కాదు, అదే రోజు మూవీ ఓపెనింగ్ కూడా ఉండొచ్చు. ఈ భారీ ప్రాజెక్ట్‌ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. టాక్సిక్, జననాయకన్ వంటి పాన్-ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తోన్న ఈ బ్యానర్‌కి ఇది టాలీవుడ్‌లో తొలి అడుగు. బడ్జెట్ కూడా హై రేంజ్‌లోనే పెట్టబోతున్నారు. పెద్ది టీమ్ కూడా బాస్‌కి శుభాకాంక్షలు చెబుతూ, దర్శకుడు బుచ్చిబాబు ఓ స్పెషల్ పోస్టర్ సిద్ధం చేస్తున్నాడట. ఇదే కాకుండా, స్టాలిన్ రీ-రిలీజ్‌ని ఏపీ, తెలంగాణలో మెగా అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. థియేటర్లు ఫుల్ ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్లేలా బ్యానర్లు, కటౌట్స్, స్పెషల్ షోలు ఇలా భారీ ప్లాన్ చేశారు.
బర్త్‌డే రోజున కేవలం కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్స్, పోస్టర్స్ మాత్రమే కాదు … ఇండస్ట్రీలోని ఇతర సినిమాల టీముల నుంచి, సెలెబ్రిటీల వ్యక్తిగత సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి విషెస్ కూడా వర్షం కురిపించబోతున్నాయి. సక్సెస్ పరంగా చూస్తే సీనియర్ హీరోల్లో బాలయ్య వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతుంటే, చిరు మాత్రం కొన్ని అడ్డంకుల వలన ఫుల్ ఫామ్‌లో కనిపించలేకపోయాడు. విశ్వంభర వాయిదా కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. కానీ ఈసారి ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశమే హద్దు. ఇకపై బాస్ స్పీడ్ వింటేజ్ స్థాయిలో ఉంటుందని, ఆగస్ట్ 22 తర్వాత మాస్ మెనియా కొత్త పేజీ మొదలవుతుందని నమ్ముతున్నారు.