కమల్ హాసన్ ఈ మధ్యకాలంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడుతూ హిందువుల చేత విమర్శలకు గురవుతున్న సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్, మోడీ,అమిత్ షా వంటి వాళ్లు సనాతన ధర్మ గురించి,హిందువుల గురించి,దేవుళ్ళ గురించి మాట్లాడితే కొంతమందికి నచ్చదు. అందులో కమల్ హాసన్ కూడా ఒకరు. అయితే కమల్ హాసన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే కొన్ని మాటల పట్ల చాలామంది నటీనటులు కూడా సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సీరియల్ నటుడు దిగ్గజ హీరో అయినటువంటి కమల్ హాసన్ కి నీ తల నరికేస్తా అంటూ బెదిరింపులకు గురిచేసాడు.ప్రస్తుతం ఆ నటుడు కమల్ హాసన్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించాయి.అయితే ఈ వ్యాఖ్యలపై కమల్ హాసన్ అభిమానులు కొంతమంది తప్పు పడుతుంటే మరికొంతమంది ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది.. 

సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు అని అంటున్నారు. మరి కొంతమందేమో ఎవరి ఇష్టం వారిది.. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి వాక్  స్వాతంత్రం కూడా ఉంది కాబట్టి ఎవరి ఆలోచనలను వాళ్ళు స్పష్టంగా మాట్లాడే హక్కు ఉంది అని అంటున్నారు.ఇక మరికొంత మందేమో వాక్ స్వాతంత్రం ఉంది ప్రజాస్వామ్యం ఉంది.. దీనిని తప్పు పట్టడం లేదు. కానీ ఇతర మతాలను, ధర్మాలను కించపరుస్తూ మాట్లాడడం మాత్రం మంచి పద్ధతి కాదు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. కమల్ హాసన్ తల నరికేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన సీరియల్ నటుడు ఎవరో కాదు రవిచంద్రన్..

తమిళంలో పలు సీరియల్స్ చేస్తూ ఫేమస్ అయిన నటుడు రవిచంద్రన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఇంకొకసారి ఇలా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడితే మాత్రం ఆయన తల నరికేస్తాను అంటూ లైవ్ లోనే తీవ్ర దుమారం సృష్టించే వ్యాఖ్యలు చేశారు.అయితే రవిచంద్రన్ వ్యాఖ్యలపై చాలామంది ఫైర్ అవుతున్నారు. ఇక రవిచంద్రన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు మక్కల్ నీది మయ్యం పార్టీ నేతలు.. మరి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే కమల్ హాసన్ కి ఇంకా ఎన్ని బెదిరింపులు మరిన్ని విమర్శలు ఎదురవుతాయో చూడాలి.. ఒకవేళ కమల్ హాసన్ మాట తీరు ఇలాగే కొనసాగితే చాలా మంది హిందూ అభిమానులు కూడా ఆయన సినిమాల్ని బ్యాన్ చేస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: