చాలా రోజుల‌ తర్వాత మళ్లీ సౌత్ సినిమా ప్రేక్షకులకు అసలైన ఫెస్టివల్ మూడ్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి రావడం వల్ల సినీప్రియుల్లో హీట్ ఓ రేంజ్‌లో పెరిగింది. ఈ రెండు సినిమాలు కూడా నేరుగా తెలుగు సినిమాలు కాకపోయినా, డబ్బింగ్ వెర్షన్‌ల రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయినప్పటికీ క్రేజ్, అంచనాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ముందు  "వార్ 2" గురించి మాట్లాడుకుంటే – దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయిక పెద్ద హైలైట్. ఇప్పటికే హిందీ బెల్ట్‌లో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ ఆకాశాన్ని తాకుతోంది. తెలుగు వెర్షన్‌కూ అదే బజ్ రావడంతో ట్రేడ్ సర్కిల్స్ అంచనాల ప్రకారం, డే 1లోనే 20 కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశముందని అంటున్నారు.


అంతేకాదు, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 కోట్ల బిజినెస్ టార్గెట్ సెట్ చేసుకుంది. ఇది డబ్బింగ్ సినిమాకి చాలా ఎక్కువ బిజినెస్‌. అటు సూపర్‌స్టార్ రజినీకాంత్ – స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న "కూలీ" కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, పంచ్ డైలాగులు ట్రైలర్ నుంచే ఫ్యాన్స్‌కి హుషారునిస్తున్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం, కూలీకి డే 1లో 15 కోట్ల షేర్ వచ్చే అవకాశముంది. మొత్తానికి, సినిమా రన్ మొత్తానికి 44 కోట్ల బిజినెస్ టార్గెట్‌గా పెట్టుకుంది.


ఈ రెండు సినిమాలు కూడా వేర్వేరు జానర్లలో, వేర్వేరు స్టార్ ఇమేజ్‌తో వచ్చినా ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొచ్చే శక్తి రెండింటికీ ఉంది. రజినీ మాస్ పుల్, లోకేష్ స్టైలిష్ టేకింగ్ ఒకవైపు ఉంటే, ఎన్టీఆర్–హృతిక్ యాక్షన్ కాంబో, భారీ స్కేల్ విజువల్స్ మరోవైపు హైలైట్‌గా నిలుస్తాయి. డే 1 కలెక్షన్స్ విషయానికి వస్తే, రెండు సినిమాలు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: