
మెగా పెంపకం అంటే ఇదే..! భార్య నిండు గర్భిణిగా ఉన్నా కూడా ఆ పని చేసిన వరుణ్ తేజ్ – హ్యాట్సాఫ్ బ్రో..!

అయితే ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్ హాజరైన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన భార్య, నటి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం నిండు గర్భిణీ అనే విషయం అందరికీ తెలిసిందే. భారతీయ సంప్రదాయం ప్రకారం గర్భిణీ భార్య ఉన్నప్పుడు భర్త శ్మశానాలకు, మరణ సంబందిత కార్యక్రమాలకు వెళ్లరాదని చాలామంది నమ్ముతారు. ఈ విశ్వాసం ఇప్పటికీ చాలా మంది కుటుంబాలు కచ్చితంగా పాటిస్తుంటాయి. కానీ వరుణ్ తేజ్ మాత్రం ఈ రకమైన మూఢనమ్మకాల కంటే కుటుంబ బంధాలను ప్రాధాన్యత ఇచ్చాడు. బాధలో ఉన్న అల్లు అరవింద్ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి, “మేమున్నాం” అని అండగా నిలబడడానికి ముందుగానే అక్కడికి వెళ్లాడు. ఈ నిర్ణయం ఆయనలోని మంచితనం, కుటుంబం పట్ల ఉన్న ప్రేమను చూపించిందని అందరూ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు వరుణ్ తేజ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. “గర్భిణి భార్యను పక్కన పెట్టి కూడా కుటుంబానికి అండగా నిలిచావు, నువ్వు నిజమైన జెంటిల్మాన్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “మెగా పెంపకం అంటే ఇదే..! నాగబాబు తన కుమారుడిని ఎంత అందంగా పెంచాడో ఈ సంఘటన చెబుతోంది” అని మరికొందరు అంటున్నారు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం ఆ ఇమేజ్ అన్నది పక్కన పెట్టి, కష్టసమయంలో కుటుంబానికి చేయూత ఇవ్వడం ద్వారా తన విలువలను నిరూపించాడు. అభిమానులు ఆయన చేసిన ఈ పనిని మెచ్చుకుంటున్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ తన కుటుంబ బంధాలను నిలబెట్టుకోవడంలో ముందుంటున్నాడు. ఈ సంఘటనతో ఆయన పట్ల అభిమానుల్లో మరింత గౌరవం పెరిగింది. “వెండితెరపై వరుణ్ తేజ్ హీరో అయితే, నిజజీవితంలో ఆయన మనసున్న మనిషి” అని నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, నేటి యువతకు ఒక మంచి సందేశం. కుటుంబ బంధాల విలువ, పెద్దలను గౌరవించడం, కష్టకాలంలో తమవారి పట్ల నిలబడటం అన్నవి ఎప్పటికీ మరవకూడని విలువలని వరుణ్ తేజ్ మరోసారి గుర్తు చేశాడు.