
ముఖ్యంగా రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో రిలేషన్ లో ఉన్నదంటూ రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. వీటికి తోడు సమంత అప్పుడప్పుడు ఆ డైరెక్టర్ తో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. దీంతో రిలేషన్ రూమర్స్ కు మరింత బలాన్ని చేకూర్చినట్టుగా కనిపిస్తోంది. వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం సమంత ఇటీవలే ఆయనతో ఉన్న ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉండడంతో తెలుస్తోంది.
వివాహమైన డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో సమంత ఉండడం మరింత హాట్ టాపిక్ గా మారుతున్నది. రాజ్ భార్య కూడా వీరి రిలేషన్షిప్ పైన ఇన్ డైరెక్టర్గా పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ వివాదాలకు మాత్రం సమంత ఇప్పటివరకు ఏ విధమైనటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. తాజాగా ఇంస్టాగ్రామ్ లో మరొకసారి తన రిలేషన్షిప్ కన్ఫామ్ చేస్తున్నట్టుగా ఒక హింట్ ఇచ్చింది. రాజ్ తో కలిసి దుబాయ్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న ఈమె.. అతని చేతిలో చేయి వేయడమే కాకుండా షాపింగ్ కూడా చేసినట్లు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కానీ ఈ ఫోటోలలో తాను చెయ్యి పట్టుకున్న వారి ముఖం కనిపించకుండా సమంత కనిపిస్తోంది. మొత్తానికి సమంత పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.