
జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లో రెండేండ్ల కిందట `అల్లు బిజినెస్ పార్క్` పేరుతో ఓ భవనాన్ని నిర్మించారు. ఈ బిజినెస్ పార్క్‌లో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్, అలాగే మరిన్ని అనుబంధ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఇది అల్లు కుటుంబ వ్యాపారాలకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. అయితే నిర్మాణంలో అనుమతి లేని మార్పులు రావడం ఇప్పుడు వారికే తలనొప్పిగా మారింది. సుమారు 1226 గజాల స్థలంలో రెండు సెల్లార్లతో పాటు జీ+4 అంతస్తుల భవనానికి అనుమతి ఉంది.
ఇటీవల నాలుగో అంతస్తుపై అనుమతులు లేకుండా పెంట్‌హౌస్‌ను నిర్మించారు. అయితే తాజాగా అల్లు బిజినెస్ పార్క్‌లో అక్రమ నిర్మాణం జరిగిందని జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్-18 డీఎంసీ సమ్మయ్య ఆదేశాలపై సర్కిల్ అధికారులు `అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదు వివరణ ఇవ్వాలి` అంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిన గడువు దగ్గరలోనే ఉంది. ఆ సమాధానంపై ఆధారపడి అధికారులు భవనం విషయంలో తుది చర్యలు తీసుకోనున్నారు. సో.. ఒకవేళ అల్లు ఫ్యామిలీ నుంచి సరైన వివరణ రాకుంటే ఆ నిర్మాణాన్ని కూల్చివేయవచ్చని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు