
సమంత తన కెరీర్‌లో ఎలా ముందుకు వెళ్ళాలి అని ప్లాన్ చేసి ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ ముందుకు వెళ్లిందో..ఇప్పుడు మినాక్షి కూడా అలానే ముందుకు వెళ్తుంది. సమంత హీరో ఎవరు, సినిమా ఎంత బడ్జెట్‌తో వస్తుంది అన్నది పెద్ద గా పట్టించుకోకుండా..? కథ, పాత్ర బలంగా ఉంటేనే సినిమాలు సైన్ చేసేది. అందుకే ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటించి అభిమానులను, విమర్శకులను మెప్పించింది. ఇప్పుడు మీనాక్షి కూడా అదే పంథాలో నడుస్తోందని ఇండస్ట్రీలో అందరూ చెబుతున్నారు. పెద్ద సినిమా, చిన్న సినిమా అన్న తేడా లేకుండా, తన పాత్రకు విలువ ఉంటే సరిపోతుందని భావించి, ఎక్కువ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేయకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట.
ఈ అంకితభావం, ప్యాషన్ చూసి అభిమానులు “ఫ్యూచర్‌లో సమంత ప్లేస్‌ను రీప్లేస్ చేసే హీరోయిన్ మీనాక్షి చౌదరి అవుతుంది” అని కామెంట్ చేస్తున్నారు. వరుస విజయాలతో, సింపుల్ నేచర్‌తో, ప్రొఫెషనల్ యాటిట్యూడ్‌తో మీనాక్షి చౌదరి పేరు రోజురోజుకూ మరింత ఎత్తుకు చేరుకుంటోంది. టాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి కి డిమాండ్ పెరిగిపోతోంది. చిన్న సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తి చూపడం, దర్శక నిర్మాతలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సమంత మాదిరిగానే ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ కెరీర్‌ను స్మార్ట్‌గా నిర్మించుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది. ఇండస్ట్రీలో కూడా మీనాక్షి పేరు నిత్యం ట్రెండింగ్ టాపిక్‌గా మారడం గమనించదగ్గ విషయం. సమంత లానే ఈవిడ కూడా తన మొదటి సినిమా హీరోనే ప్రేమించి పెళ్లి చేసుకుంటుందా..? అనేది ఇప్పుడు బిగ్ డౌట్..!!