కన్నడ సినీ పరిశ్రమ నుంచి గడిచిన మూడు సంవత్సరాల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం కాంతార. ఈ సినిమా కన్నడ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. కేవలం రూ .15 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ .400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఒక సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి ఫ్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.


మేకర్స్ ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ ప్లాన్ వేస్తున్నట్లుగా శాండిల్ వుడ్ లో వినిపిస్తోంది. అదేమిటంటే అక్టోబర్ ఒకటవ తేదీన సాయంత్రం 7 గంటలకు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షోలు వేయాలనే ఆలోచనతో చిత్ర బృందం ఉన్నట్లు వినిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే కన్నడ సినీ పరిశ్రమలో ప్రీమియర్ షో నిర్వహించిన మొట్టమొదటి చిత్రంగా కాంతార చాప్టర్ 1 నిలుస్తుంది. తెలుగు, తమిళ భాషలలో ఇప్పటికే ప్రీమియర్ షోకి సంబంధించి బాగానే ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాంటి ట్రెండ్ ను కాంతార చిత్ర బృందం ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.


కాంతార చాప్టర్ -1 సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని భాషలలో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదల అయితే ఖచ్చితంగా ఈ సినిమా రేంజ్ పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మేకర్స్ ప్రీమియర్ షోల పైన ఎటువంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ సినీవర్గాల నుంచి మాత్రమే ఈ విషయం వైరల్ గా మారుతోంది. మరొకవైపు నార్త్ అమెరికాలో 50 కి పైగా ఐమాక్స్ థియేటర్లలో ఈ చిత్రాన్ని మల్టిపుల్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. మరి శాండిల్ వుడ్ లో కాంతార చాప్టర్ -1 సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: