టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తేజ కొంత కాలం క్రితం హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఈ సినిమా ద్వారా తేజ కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. హనుమాన్ లాంటి భారీ విజయం తర్వాత తేజ తాజాగా మిరాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే.

కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... మంచు విష్ణు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలలో విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ ఓపెనింగ్స్ దక్కాయి. అలాగే ప్రస్తుతం కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో అదిరిపోయే రేంజ్ రికార్డులను సొంతం చేసుకుంటుంది. 

దాదాపు ఈ సినిమా బుక్ మై షో ఆప్ లో స్టార్ హీరోల సినిమాల రేంజ్ సేల్స్ ను జరుపుకుంటుంది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ బృందం వారు ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 1.4 మిలియన్ టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకదరణ బట్టి చూస్తే ఈ మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో ఆప్ లో టోటల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి 2 మిలియన్ సేల్స్ ను అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: