
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో తేజ సజ్జా ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జాంబిరెడ్డి, హనుమాన్, మిరాయ్ సినిమాలతో తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్ విజయాలను అందుకున్న తేజ సజ్జా రాబోయే రోజుల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తేజ సజ్జా కెరీర్ ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
మిరాయ్2, జై హనుమాన్, జాంబిరెడ్డి2 సినిమాలలో తాను నటిస్తానని తేజ సజ్జా తెలిపారు. ఈ మూడు సినిమాలు హిట్ సినిమాలు కావడంతో తేజ సజ్జా ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు ఖాయమని చెప్పవచ్చు. తేజ సజ్జా సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందిస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవడం తేజ సజ్జాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు.
దర్శకుల ఎంపికలో సైతం తేజ సజ్జా సరైన దారిలో అడుగులు వేస్తున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. తేజ సజ్జా రెమ్యునరేషన్ సైతం వరుస విజయాలతో భారీ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది. తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే తేజ సజ్జా రేంజ్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే తేజ సజ్జా కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. తేజ సజ్జా లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. తేజ సజ్జాకు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. బాలనటుడిగా ఎన్నో విజయాలను అందుకున్న తేజ సజ్జా భవిష్యత్తులో టైర్1 హీరో రేంజ్ కు ఎదుగుతారేమో చూడాల్సి ఉంది. తేజ సజ్జా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.