నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసమే తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలుపుతోంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ పోలీస్ శాఖలో 12,452 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమయ్యింది. పోలీస్ శాఖ లో వివిధ భాగాలలో ఉండే ఖాళీలకు సంబంధించిన అన్ని విషయాలు తెలియజేయాలని అధికారులను కోరింది ప్రభుత్వం. ఈ ఉద్యోగాలకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది.


అయితే నివేదిక తెలిపిన ప్రకారం ఇందులో సివిల్ కానిస్టేబుల్ విభాగంలో.. 8,442 పోస్టులు ఖాళీగా ఉన్నాయని. AR పోస్టులను 3,271 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ రెండు విభాగాలను కలిపితే సుమారుగా 11,500 పోస్టులకు పైగా ఖాళీలు ఉన్నాయి.కానిస్టేబుల్ పోస్ట్ తో పాటుగా ఎస్ఐ ఉద్యోగాలు కూడా విడుదల చేయబోతున్నారు. ఇందులో సివిల్ ఎస్సై - 677 పోస్టులు ఉండగా ఏఆర్ - 40 పోస్టులు,TGSP SI పోస్టులు 22 కలవు.. త్వరలోనే రెండిటికీ  సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసే అవకాశం ఉన్నది.


ఈ భారీ పోలీస్ రిక్రూమెంట్ ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు నిరుద్యోగులకు  ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రక్రియ గానే ఇప్పుడు అడుగులు వేస్తున్నామంటు తెలియజేస్తున్నారు. అయితే తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం ఇది చక్కటి అవకాశమని చెప్పవచ్చు. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాల భర్తీకి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: