
ఆన్‌లైన్ లో టికెట్లు రిలీజ్ చేసిన వెంటనే క్షణాల్లోనే “సోల్డ్ అవుట్” అని చూపించేయడం హైలైట్‌గా మారింది. హైదరాబాదులో మారుమూల ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో కూడా ఇదే సీన్. అంటే పవర్ స్టార్ మానియా ఏ స్థాయిలో ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. థియేటర్ యాజమాన్యం టికెట్లు రిలీజ్ చేసిన వెంటనే ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా నిమిషాల్లో టికెట్లు సేల్ అవుతున్నాయి. ఇంకా అసలు ప్రీమియర్ షోలు అందుబాటులోకి రాలేదు. రెగ్యులర్ షోకే ఇంత హంగామా కనిపిస్తుంటే, ప్రీమియర్ షోలు రిలీజ్ అయిన తర్వాత ఏ స్థాయి కలకలం రేపుతాయో ఊహించుకోవచ్చు. హైదరాబాదులోని క్రాస్ రోడ్స్ సింగిల్ స్క్రీన్లో అప్పర్ బాల్కనీ రేట్ దాదాపు ₹450 కు పెంచేశారు. నిజానికి ప్రభుత్వంగా ఇచ్చిన పెంపు ₹100 మాత్రమే. కానీ టికెట్ రేట్లు ఇంత భారీ స్థాయిలో పెరగడం చూసి కొంతమంది ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. మిగతా ప్రాంతాల్లో రేట్లు ₹275 వరకే ఉన్నాయి. మల్టీప్లెక్స్ రేట్లు ఇంకా జోడించలేదు.
అదే సమయంలో ఓ జి టీమ్ స్పెషల్‌గా డిస్ట్రిక్ట్ యాప్ తో టై అప్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం డబుల్ అయింది.ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి కొంత క్లిష్టంగా మారింది. అర్ధరాత్రి 1 గంట షోకు ₹1000 టికెట్లు అనుమతించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలో ముందురోజే రాత్రి షోలు వేయడం జరుగుతుండగా, ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కొంత టెన్షన్ లో ఉన్నారు. షోలకు అనుమతి ఎలాంటి రూల్స్ లో వస్తాయో అని ఆలోచిస్తున్నారు. రిలీజ్ కి ఇంకో ఐదు రోజుల సమయం ఉన్నప్పటికీ, టికెట్ బుకింగ్స్ విషయంలో మాత్రం అభిమానులు అస్సలు తగ్గడం లేదు. ఎక్కడ టికెట్లు రిలీజ్ చేసినా అక్కడ కొన్ని సెకన్లలోనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే ఓ జి రికార్డులను బద్దలుకొట్టడం మాత్రమే కాదు, కొత్త హిస్టరీ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఉన్న అన్ని హై రికార్డ్స్ ఈ సినిమా బ్లాస్ట్ చేసేలా కనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా – ట్రైలర్ రిలీజ్ కూడా కాలేదు. ఇప్పటివరకు ట్రైలర్ లేకుండానే ఫ్యాన్స్ మూడ్ ఇలా ఉంటే, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సీన్ ఎలాంటి స్థాయికి వెళ్తుందో ఊహించుకోవడమే గూస్బంప్స్ తెప్పిస్తోంది.సినిమా రిలీజ్ అయి కంటెంట్ హిట్ అయితే మాత్రం నో డౌట్, పవర్ స్టార్ పేరు మరోసారి ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది. ఇప్పటికే ఉన్న పవన్ కళ్యాణ్ క్రేజ్‌కి మరింత రెట్టింపు జోష్ ఇస్తుంది.
మొత్తానికి, ఫ్యాన్స్, ఆడియన్స్, ఇండస్ట్రీ వర్గాలు అన్నీ ఒకే మాట అంటున్నాయి – “ఓ జి రాబోతుంది... రికార్డ్స్ బద్దలు అవుతాయి... పవర్ స్టార్ మానియా మరోసారి ఇండస్ట్రీని షేక్ చేస్తుంది!”