
శివ రీ రిలీజ్ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ – “నా తండ్రి ఎప్పుడూ సినిమాలు తరతరాల వరకు నిలిచి ఉంటాయని నమ్మేవారు. శివ అలాంటి చిత్రమే. ఇప్పుడు దాన్ని 4K డాల్బీ అట్మాస్‌లో మళ్లీ తెరపైకి తీసుకురావడం ఆయన కలలలో ఒకదానికి నిజం కావడం లాంటిదే” అని అన్నారు. స్పెషల్ ఏంటంటే శివ మొదట విడుదలైనప్పుడు మోనో సౌండ్ మిక్స్‌తో వచ్చింది. అయితే ఇప్పుడు అత్యాధునిక ఏఐ టెక్నాలజీ సాయంతో పూర్తిగా కొత్తగా డాల్బీ అట్మాస్ సౌండ్‌లో రీ-మాస్టర్ చేశారు. ఇది ఇప్పటి వరకు ఏ రీ-రిలీజ్ సినిమాకి జరగని ఘనత. శివలోని సౌండ్ డిజైన్ అప్పట్లోనే విప్లవాత్మకంగా ఉండగా, ఇప్పుడు మరింత ఆధునిక అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సందర్భంగా – “ఈ కొత్త సౌండ్ అనుభవంతో శివను మళ్లీ చూడటం ప్రేక్షకులకు కొత్త యాత్రలాంటిది. మునుపెన్నడూ చూడని, వినని అనుభూతి ఇప్పుడు అందరికీ లభిస్తుంది. ఆ అనుభవం కోసం నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అని నాగ్ చెపుతున్నారు. తెలుగు సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా చరిత్రలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన శివ మళ్లీ నవంబర్ 14 నుంచి ప్రేక్షకుల మనసులను కట్టిపడేయడానికి సిద్ధమైంది. 4K విజువల్స్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ అనుభవం, ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను కొత్త తరానికి మరింత దగ్గర చేస్తుందంటోన్నారు.