
అందులోనూ ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ జారీ చేసింది. మెగా హీరో నటించిన సినిమా ఒకదానికి ఈ సర్టిఫికేట్ రావడం దాదాపు 16–17 ఏళ్ల తర్వాత జరుగుతున్న విషయం. ఆఖరిసారిగా 2009లో రామ్ చరణ్ నటించిన రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన “మగధీర” సినిమాకే ‘A’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ తర్వాత మెగా కుటుంబం హీరోలు నటించిన సినిమాల్లో దేనికి ఇలాంటి సర్టిఫికేట్ రాకపోవడం గమనార్హం. సుమారు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” సినిమాకి ‘A’ సర్టిఫికేట్ రావడం ఇప్పుడు హైలైట్‌గా మారింది.
అంతేకాదు, సెన్సార్ బోర్డు ఈ సినిమాపై సుమారు 8 సూచనలు చేసింది అని సమాచారం. ముఖ్యంగా రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలు తగ్గించే విధంగానే ఆ సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తం కలిపి దాదాపు 1 నిమిషం 55 సెకన్ల పాటు ఉండే 55 షాట్స్‌ను రిమూవ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రియాంక ఆర్మూర్ తో ఉన్న పవన్ కళ్యాణ్ సీన్‌ను కూడా క్రాప్ చేయడం జరిగింది అని టాక్ వినిపిస్తోంది.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ వంటి వారు నెగిటివ్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్‌లతో ఫ్యాన్స్‌లో హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లిన ఈ సినిమా, ఇప్పుడు సెన్సార్ టాక్ బయటకు రావడంతో మరింత వైరల్‌గా మారింది.
అప్పట్లో “మగధీర” సినిమా ఎంతటి సెన్సేషన్ రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అభిమానులు అదే స్థాయిలో కాకుండా దానికి మించి, డబుల్ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది “ఓజీ” అని ధీమాగా చెబుతున్నారు. సెన్సార్ టాక్ కూడా సినిమా పై పాజిటివ్ బజ్‌ని పెంచి, ఓజీకి మరింత ప్లస్‌గా మారుతుందనే నమ్మకం అభిమానుల్లో నెలకొంది.