పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన “ఓజీ” మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు పడగా, గురువారం ఉదయాన్నే రెగ్యులర్ షోలు మొదలయ్యాయి. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు “అదిరిపోయింది.. పవన్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, తమన్ బీజీఎమ్ సినిమా స్థాయిని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాయి” అంటూ సోషల్ మీడియాలో ఫుల్ హంగామా చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే ఓవర్సీస్‌లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దుమ్మురేపుతూ, వరల్డ్‌వైడ్‌గా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.75 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ టాక్. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్‌ల్లో గత 24 గంటల్లోనే 2.5 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడైపోవడం ఈ మూవీకి ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.


పవన్ కెరీర్లో ఇప్పటివరకు అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 70 కోట్లు. అది కూడా ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లు సినిమాతో సాధించిన రికార్డు. కానీ ఇప్పుడు ఓజీ ఆ రికార్డుని సులభంగా చెరిపేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందని ఇండస్ట్రీలో హైప్. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ.75 కోట్లు వచ్చేసిన ఈ మూవీ, ఫస్ట్ డే రెగ్యులర్ బుకింగ్స్‌తో మరో రూ.75 కోట్లు సంపాదించే అవకాశముందని అంచనా. అంటే ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ కలెక్షన్ రూ.150 కోట్ల వరకు వెళ్లొచ్చని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో సగం వరకు రెమ్యూనరేషన్లపైనే ఖర్చయినట్లు సమాచారం. హీరో పవన్ కళ్యాణ్ రూ. 80 కోట్లు, డైరెక్టర్ సుజీత్ రూ.8 కోట్లు, విలన్ ఇమ్రాన్ హష్మీ రూ.5 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రూ.5 కోట్లు, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ రూ.1.5 కోట్లు, శ్రియా రెడ్డి రూ.50 లక్షలు అందుకున్నారని వార్తలు.



ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే, వరల్డ్‌వైడ్‌గా రూ.194 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. అందులో ఆంధ్రా రూ.80 కోట్లు, సీడెడ్ రూ.22 కోట్లు, నైజాం రూ.55 కోట్లు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం రూ.157 కోట్లు బిజినెస్ జరగడం గమనార్హం. నార్త్ అమెరికాలో కూడా 2.9 మిలియన్ డాలర్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని, బ్రేక్ ఈవెన్ కావాలంటే 4.5 మిలియన్ డాలర్లు కావాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 2.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలవడంతో ఓవర్సీస్‌లో పెద్దగా టెన్షన్ ఏమీ లేదు.మొత్తానికి.. ఓజీ మేనియాతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. పవన్ స్టైల్, సుజీత్ టేకింగ్, తమన్ మ్యూజిక్ కలయికతో ఈ సినిమా మొదటి రోజే ఇండస్ట్రీ రికార్డులు రాసే అవకాశం కనిపిస్తోంది. పవర్ స్టార్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: