
ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉందని చూసినవారు వెల్లడించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు హారర్ బ్యాక్ డ్రాప్ లో మదర్ సెంటిమెంట్ తో తీసిన ఈ లేడీ ఓరియేంటెడ్ సినిమా అందరూ కలిసి చూసే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్ కి వచ్చి చూడాలని కోరారు. ప్రమోషన్స్ జోరు పెంచుతున్నామని, అక్టోబర్ 3న రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి, అక్టోబర్ 5 న విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపారు.
ఎర్ర చీర ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణను కలిసి సినిమా ట్రైలర్ ను చూపించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. ఎర్ర చీర ట్రైలర్ చాలా బాగుందని, సినిమా అక్టోబర్ 10న విడుదల అవుతోందని, అందరూ తప్పకుండా థియేటర్లలలో చూడాలని చెప్పారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.