మనందరికీ తెలిసిందే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలపై ఆయన దృష్టి తగ్గిపోయింది. ఒకప్పటి పవన్ కళ్యాణ్ లాంటి ఎనర్జీ, ప్యాషన్ సినిమాల్లో కనిపించడం లేదేమో అంటూ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. “మా పవన్ అన్న సినిమాలపై పూర్తిగా ఫోకస్ పెట్టడం మానేశాడు” అని బాధపడిపోయారు ఆయన అభిమానులు. కానీ ఆ అనుమానాలన్నింటినీ, ఆ విమర్శలనన్నింటినీ ఒక్క దెబ్బతో త్రుంచి వేసిన వ్యక్తి దర్శకుడు సుజిత్.


సుజిత్ ఒక దర్శకుడు కావడానికి ముందు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నాడని ఆయన స్వయంగా అంగీకరించాడు. ఒక ఫ్యాన్ తన స్టార్ కోసం సినిమా చేస్తే ఎలాంటి ప్యాషన్ తో ఉంటుందో, ఎలాంటి ఎమోషన్ తో తెరకెక్కుతుందో సుజిత్ ద్వారా అందరికీ స్పష్టమైంది. ఆయన దర్శకత్వం వహించిన “ఓజీ ” సినిమా చూస్తున్నంత సేపు గూస్బంస్ రాకుండా ఉండదు. ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టే అనిపిస్తుంది.



ఇక సినిమా విషయానికి వస్తే, రిలీజ్ అయిన వెంటనే “ఓజీ” సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించింది. సోషల్ మీడియాలో, థియేటర్ల వద్ద, ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ తో పాటు మంచి కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. రికార్డులు బద్దలవుతూ, బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతూ ముందుకు వెళ్తోంది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, జనరల్ ఆడియెన్స్ కూడా పవన్ కళ్యాణ్ నటన, సుజిత్ దర్శకత్వం, తమన్ సంగీతం, టెక్నికల్ వర్క్ అన్నిటినీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.కానీ ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు సోషల్ మీడియాలో “ఓజీ”కు సంబంధించిన ఒక న్యూస్ మాత్రం పెద్ద ఎత్తున నెగిటివ్ టాక్ సంపాదించుకుంటోంది. అదేమిటంటే, ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం. ప్లాన్ ప్రకారం ట్రైలర్ మొత్తం రెడీ కాకముందే, ట్రైలర్ పూర్తిగా అవ్వకముందే పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం వెంటనే రిలీజ్ చేయమని చెప్పడంతో ట్రైలర్ బయటకు వచ్చింది.



సినీ మేకర్స్ ప్లాన్ ప్రకారం అన్నీ సెట్ అయ్యి ఉండి, సరైన టైమింగ్ లో ట్రైలర్ రిలీజ్ చేసి ఉంటే కోట్లు రూపాయల విలువ చేసే బిజినెస్ డీల్‌లు క్లోజ్ చేసుకునే అవకాశం ఉండేదని అనేక మంది సినీ ప్రముఖులు భావిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ వర్షంలో తడుస్తూ, తనకోసం ఎంతదూరం వచ్చారో చూసి ఎమోషనల్ అయ్యి, “ఇవాళే ట్రైలర్ ఇవ్వాలి” అని పట్టుబట్టడంతో అది రిలీజ్ అయింది.ఈ తొందరపాటు నిర్ణయం వల్ల సినిమా మేకర్స్‌కు కోట్లలో నష్టం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇది విని ఇండస్ట్రీ వర్గాలు కూడా కొంతవరకు బాధపడుతూ, “సరిగ్గా ఆలోచించి ట్రైలర్‌ని ప్లాన్ ప్రకారం రిలీజ్ చేసి ఉంటే మేకర్స్ భారీ లాభాలు పొందేవారు” అని అభిప్రాయపడ్డారు.



అయితే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయన డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించరు. ఆయనకు ముఖ్యమైంది తన అభిమానులు ఆనందంగా ఉన్నారా..? లేదా..? అన్న విషయమే. ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే ఆయనకి అదే పెద్ద లాభం. అందుకే ఈ ట్రైలర్ ఎపిసోడ్‌ని చాలా లైట్‌గా తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం, “మా అన్న ఎప్పుడూ మనకోసమే ఆలోచిస్తాడు. ఆయన మనల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు డబ్బు నష్టాలు లాభాలు ఇవ్వని పెద్ద మ్యాటర్ కావు” అని చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.

మొత్తం మీద, పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌ కోసం ఎంత వరకు వెళ్ళగలడో, ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకోగలడో మళ్ళీ ఒకసారి ఈ సంఘటనతో ప్రూవ్ అయిపోయింది. ఇక “ఓజీ” సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో, ఈ చిన్న నెగిటివ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చేయలేదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: