
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ దాస్, శ్రీయ రెడ్డి వంటి నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ లేటెస్ట్ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ నిన్న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి, మొదటి షో నుంచే సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడకుండా ఉండలేరు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్— అన్నిఅభిమానులను మరియు నార్మల్ ఆడియన్స్‌ని సమానంగా ఆకట్టుకున్నాయి. అయితే, ఎంత పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయో, అంతే నెగిటివ్ రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు హర్ట్ అయిన విషయం ఒక్కటే—డాన్స్. పవన్ కళ్యాణ్ అంటే నాటి పాటల్లో స్టెప్స్, ఎనర్జీతో ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ ఇస్తారు. అలాంటి ఎక్స్‌పెక్టేషన్‌తో అభిమానులు ఈ సినిమాకి వెళ్లారు. కానీ ఓజీ సినిమాలో అలాంటి డాన్స్ పర్ఫార్మెన్స్ ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది.
ఇక మరోవైపు, ఈ సినిమాలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ చిత్రీకరించినప్పటికీ, ఎడిటింగ్ సమయంలో దాన్ని తొలగించారట. ఆ పాటలో హీరోయిన్‌గా నేహా శెట్టి నటించిందని సమాచారం బయటకు వచ్చింది. ఇంత మంచి సినిమాలో స్పెషల్ సాంగ్‌ను లేపేయడం ఫ్యాన్స్‌కి పెద్ద షాక్‌గా మారింది. ఆ పాట కూడా ఫైనల్ కట్‌లో ఉంచి ఉంటే బాక్సాఫీస్ వద్ద మరింత కలెక్షన్ల వర్షం కురిసేదని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దాంతో డైరెక్టర్ సుజిత్ ఈ విషయంలో తప్పు నిర్ణయం తీసుకున్నారని అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు.అయినా సరే, సుజిత్‌కి పవన్ కళ్యాణ్ అభిమానులను ఎలా మెప్పించాలో బాగా తెలుసు. ఆ ఐటెం సాంగ్‌కి రీప్లేస్‌గా ఆయన సినిమాకి జోడించిన యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉన్నాయి.. సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. ప్రతి ఫైట్ సీన్‌లో పవన్ కళ్యాణ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, పవర్-ప్యాక్డ్ మాసివ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.
ఇండస్ట్రీలో డైరెక్టర్ సుజిత్ పేరు ఇప్పుడు ట్రెండ్ కావడానికి ఈ యాక్షన్ ఎపిసోడ్‌లే ప్రధాన కారణమని చెప్పడంలో సందేహమే లేదు. ఒకవైపు ఫ్యాన్స్‌ని సంతృప్తిపరిచే యాక్షన్, మరోవైపు పవన్ కళ్యాణ్ కెరియర్లో మరో మైలురాయిగా నిలిచే పెర్ఫార్మెన్స్—ఇవి కలగలిపి ఓజీని ఈ ఏడాది టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్‌గా నిలిపేశాయి.