ప్రభాస్ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూసే ‘ది రాజా సాబ్’ ట్రైలర్ అప్‌డేట్ తాజాగా అందింది. సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదలకానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాక, అన్ని సినీ ప్రేక్షకులలోనూ భారీ ఉత్సాహం నెలకొంది. పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే ఎక్కువగా యాక్షన్, పీరియాడిక్ సినిమాలతో స్టార్ ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ‘ది రాజా సాబ్’ ఆయన తొలిసారి రొమాంటిక్ హార్రర్ మూవీలో కనిపిస్తోందని ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ప్రభాస్ స్టైలిష్ లుక్, యాక్షన్, కామెడీ టైమింగ్‌ను అదిరిపోయేలా ప్రదర్శించాడు. ఇది ట్రైలర్‌లో మరింత పాన్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్‌గా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.


ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్లతో రొమాన్స్ సీన్లు కనీసం కనిపించకపోవడంతో, ట్రెండ్‌ను బట్టి ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను తీసుకున్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ, ఈ సినిమా హారర్ థ్రిల్లర్ అయినప్పటికీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్ కి నచ్చే అంశాలను బాగా పండించి వుంటుందన్నారు. ట్రైలర్‌లో ప్రభాస్ పాత్ర డెప్త్, సినిమా హంగులు స్పష్టంగా కనిపించబోతున్నాయి. హారర్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, మ్యూజిక్ బీజీఎం – అన్ని ఫ్యాన్స్‌ను అలరించేలా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రైలర్ రాకముందే సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.



ప్రభాస్ నుంచి చివరి సినిమా వచ్చి ఏడాది గడిచింది. మధ్యకాలంలో ‘కన్నప్ప’లో స్పెషల్ రోల్ మాత్రమే చేశాడు. ‘ది రాజా సాబ్’ టిజ‌ర్ తర్వాతే సినిమాకు మంచి హైప్ వచ్చి, జనవరి 9న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముందుగా డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్న ప్లాన్ ఆలస్యంతో వాయిదా పడింది. మొత్తం మీద.. ‘ది రాజా సాబ్’ ట్రైలర్ రీలీజ్‌కు అప్‌డేట్ రావ‌డంతో ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా ఉత్సాహం చెందారు. రొమాంటిక్ హార్రర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రతి ప్రేక్షకుల్ని మెప్పించబోతుందన్న అంచనాలు కాస్తా భారీగానే ఉన్న‌యి.



మరింత సమాచారం తెలుసుకోండి: