కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరో గా నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 అనే సినిమా ఈ రోజు అనగా అక్టోబర్ 2 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. కొంత కాలం క్రితం కాంతారా అనే సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. కాంతారా సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. కాంతారా సినిమా తెలుగులో మంచి విజయం సాధించడంతో కాంతారా చాప్టర్ 1 మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి నైజాం ఏరియాలో 40 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 40 కోట్లు , సీడెడ్ ఏరియాలో 10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిసినెస్ జరిగింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 90 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన జరిగింది. ఈ మూవీ టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులు బాటును కల్పించింది.

దానితో కాంతారా చాప్టర్ 1 సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకొని లాభాలను అందుకోవడం కాస్త సులభమే అయినప్పటికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు వేసెలు బాటును కల్పించలేదు. దానితో తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకొని లాభాలను అందుకోవడం కాస్త కష్టం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: