సాధారణంగా హీరోయిన్లకు అంత కోపం రాదు.కానీ వినకూడనివి వింటే మాత్రం అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో తమ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే తాజాగా థామా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందన్నా ట్రోలర్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.ఈ ఒక్క దెబ్బతో అందరి నోళ్లు మూత పడిపోయేలా రష్మిక ఇచ్చిన కౌంటర్ అద్భుతంగా ఉంది అని ఆమె అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇంతకీ రష్మిక థామా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అనేది ఇప్పుడు చూద్దాం.. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా తన మాతృభాష అయినటువంటి కన్నడ ఇండస్ట్రీ నుండి ఎప్పుడు నెగిటివిటీ వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ముఖ్యంగా కాంతార సినిమా సమయంలో ఈ వివాదం రాజుకుంది.అప్పటి నుండి ఇలాగే కొనసాగుతూ ఉంది. అయితే రీసెంట్గా కాంతార చాప్టర్ 1 విడుదలైన టైంలో ఆ సినిమాకి విష్ చేయలేదు అని, దేశం మొత్తం కాంతార సినిమా చూసి మెచ్చుకుంటే రష్మిక మాత్రం సైలెంట్ గా ఉంది అని ఎంతోమంది ఆమెపై నెగటివ్ కామెంట్స్ చేశారు. కానీ ఈ కామెంట్లపై తాజాగా క్లారిటీ ఇచ్చింది రష్మిక. కాంతార మూవీ టీం కి నేను విష్ చేయలేదు అని మీరు చూశారా..నేను ఎప్పుడో కాంతార మూవీ చిత్ర యూనిట్ కి విష్ చేశాను. అన్ని ఆన్లైన్లో పెట్టాలని లేదు కదా..

అన్ని విషయాలను ఆన్లైన్లో పెట్టుకోవడం నాకు నచ్చదు.నా నటనపరంగా ఎవరు ఏమన్నా పట్టించుకుంటాను.కానీ నా  పర్సనల్ విషయాల గురించి ఎవరు ఏమన్నా పట్టించుకోను అంటే సంచలన వ్యాఖ్యలు చేసింది రష్మిక మందన్నా. అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో తనని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది అనే వార్తలపై కూడా స్పందించింది. నన్ను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదు. అదంతా ఫేక్ రూమర్ మాత్రమే.. తెర వెనక ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలియదు అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.. రష్మిక క్లారిటీతో చాలామంది ట్రోల్స్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చినట్టైంది.. రష్మిక క్లారిటీతో అందరి నోళ్ళు మూతపడ్డాయి అంటూ ఆమె ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: