
ఈ నిశ్చితార్థం వార్తలతో సోషల్ మీడియా మారుమ్రోగిపోతుంది. గతంలో రష్మిక మందన చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ —“సెలబ్రిటీల లైఫ్ చాలా భిన్నంగా ఉంటుంది. మన జీవితంలోని ప్రతి అంశాన్ని కెమెరా ముందు ఉంచడం సాధ్యం కాదు. లోపల ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకపోవచ్చు. వ్యక్తిగత జీవితంలోకి కెమెరాలు రావడం మాకు ఇష్టం లేదు. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. కెమెరా ముందు ప్రొఫెషనల్ విషయాలు మాట్లాడవచ్చు కానీ పర్సనల్ విషయాలు ప్రైవేట్‌గా ఉండాలి” అని స్పష్టంగా చెప్పింది.
ఇప్పుడు అదే మాటలను నెటిజన్లు తిరిగి షేర్ చేస్తూ — “అందుకే రష్మిక తన నిశ్చితార్థం విషయాన్ని బయట పెట్టలేదేమో” అని కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే కూడా ఆమె మాటలు దానికి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం రష్మిక మందనకే పరిమితం కాదు. గతంలో చాలా మంది స్టార్ హీరోయిన్లు కూడా తమ ప్రైవసీ గురించి ఘాటుగా స్పందించారు. ఒక బాలీవుడ్ హీరోయిన్ అయితే ఎకంగా మీడియా ఎదుటే కోపంగా మాట్లాడుతూ —“ఏమిటి? ఇక బెడ్‌రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టి చూస్తారా?”అని తిడుతూ మీడియాపై మండిపడ్డారు". ఈ సంఘటనలన్నీ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి — స్టార్ సెలబ్రిటీలకూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. వాళ్లు తెరపై ఎంత బహిరంగంగా కనిపించినా, వారి వ్యక్తిగత జీవితం మాత్రం వారి సొంతదే. ఆ ప్రైవసీని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక–విజయ్ నిశ్చితార్థం వార్తలతో పాటు, “సెలబ్రిటీల ప్రైవసీ” అనే అంశం మళ్లీ ప్రధాన చర్చగా మారింది. సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియా వేదికల్లో ఇదే టాపిక్ ఇప్పుడు హాట్‌గా వైరల్ అవుతోంది.