
ఈ ఫోటో బయటకు రావడంతోనే “వెంకీ – త్రివిక్రమ్ కాంబో ఫైనల్ అయిపోయింది?” అంటూ క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఈ కాంబినేషన్ కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ వెంకటేష్ కెరీర్‌లో 77వ సినిమాగా తెరకెక్కనుందట. గత ఆగస్టులోనే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేసిన ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ దశకు చేరుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సర్కిల్స్ సర్కులేట్ అవుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుందట. దాదాపు 24 మంది ప్రముఖ నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు అంటూ తెలుస్తుంది. అభిమానుల మాటల్లో చెప్పాలంటే — “ఇది త్రివిక్రమ్ స్టైల్లో ఎమోషన్, వెంకీ మామ స్టైల్లో ఫన్!” అని అంటున్నారు.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోపై మరో యాంగిల్‌లో కూడా చర్చ మొదలైంది. ఫ్యాన్స్ కొందరు ఆ ఫోటోను పదే పదే జూమ్ చేసి చూస్తూ, "వెంకటేష్ గారు ఎప్పటిలానే కూల్‌గా, యంగ్‌గా ఉన్నారు కానీ త్రివిక్రమ్ గారు మాత్రం చాలా మారిపోయారు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. “త్రివిక్రమ్ బాగా లావైపోయినట్టున్నారు”, “గడ్డం తెల్లగా, జుట్టు నల్లగా ఉంది.. ఈ కాంబినేషన్ ఏంట్రా బాబోయ్!” అంటూ కొందరు సరదాగా కిండల్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం “ఇది త్రివిక్రమ్ లుక్ మార్చుకోవడమే, కొత్త సినిమా కోసం కావచ్చు” అంటూ ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఏదేమైనా ఈ ఒక్క ఫోటోతోనే సోషల్ మీడియా లో పెద్ద చర్చ మొదలైందంటే వెంకీ–త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ఎంత ఎక్సైట్మెంట్ ఉందో అర్థం అవుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా టైటిల్, కథాంశం, స్టార్ కాస్ట్‌కు సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు మూవీ మేకర్స్ ప్రకటించబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులకైతే ఒక్క మాటే — “వెంకీ మామ & వర్డ్ మేజిషియన్ త్రివిక్రమ్ కలిస్తే ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ!” అంటున్నారు..!