ఇటీవలి కాలంలో మద్యం తాగే అలవాటు ప్రతి ఒక్కరికి కామన్ గా మారిపోయింది. ఒకప్పుడు మద్యం తాగేవాడిని కాస్త విచిత్రంగా చూసేవారు. అబ్బే ఆ వ్యక్తి పూర్తిగా చనిపోయాడు అని అనుకునే వారు. కానీ ఇప్పుడు మద్యం తాగకుండా కూల్ డ్రింక్ లతో  సరిపెట్టుకునే వాళ్ళని కాస్త విచిత్రంగా చూస్తున్నారు. అదేంటి వీడు ఇంకా చనిపోలేదా అంటూ అనుకుంటున్నారు ఎంతోమంది. ఇలా ఇటీవలి కాలంలో మద్యం తాగడం అనేది కామన్ గా మారిపోయింది. సామాన్యులు ఒకే రకం మద్యం తాగాలి అని ఎప్పుడూ అనుకోరు. మీది ఏ బ్రాండ్ అని అడిగితే.. అది ఇది అంటూ  ఏం లేదు.. బడ్జెట్ ను బట్టి బ్రాండ్ మారుతూ ఉంటుంది అంటూ సమాధానం చెబుతూ ఉంటారు. అయితే సామాన్యులు ఇలా ఉంటే సంపన్నుల మాత్రం కాస్లీ మద్యం తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు..


 ఈ క్రమంలోనే ఏకంగా వేల రూపాయలు కాదు మద్యం కొనుగోలు చేసేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడరు ఎంతో మంది సంపన్నులు. ఇంకొంతమంది కాస్త డబ్బు లు ఎక్కువైతే  ఇక ఒక్క మద్యం సీసా కి కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటిదే చేసి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఒకవైపు చౌక ధరలకు మద్యం లభిస్తున్నప్పటికీ కాదని ఒక వేలంలో పాల్గొన్నాడు. ఇక ఈ వేలంలో వేలు కాదు, లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలు చెల్లించి ఒక మద్యం సీసాను కొనుగోలు చేశాడు. ఇక ఇలా ఒక మద్యం బాటిల్ కి కోట్ల రూపాయల ధర  పలకడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు లో ఉన్న డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాప్ లో 55 ఏళ్ల ఓల్డ్ విస్కీ ది యమ జకినీ అని బాటిల్ ను వేలంలో పెట్టగా దీన్ని సొంతం చేసుకునేందుకు ఎనిమిది మంది పోటీపడ్డారు. చివరికి చైనాకు చెందిన ఓ వ్యక్తి నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల పౌండ్లకు దక్కించుకున్నాడు. అంటే భారత కరెన్సీ ప్రకారం 4.14 కోట్ల రూపాయలు ఒక్క మద్యం బాటిల్  కోసం ఖర్చు చేశాడు సదరు వ్యక్తి. రికార్డు స్థాయిలో విస్కీ బాటిల్ అమ్మకం జరగడంతో యూని ఫ్రీ డ్యూటీ ఫ్రీ సీఈఓ ఆలీ హర్షం  వ్యక్తం చేయడం గమనార్హం.  అయితే దాదాపు 55 ఏళ్ల క్రితం తయారు చేసిన విస్కీ కావడంతోనే ఇక ఈ మందు బాటిల్  ఇంత ధర పలికింది అని చెబుతున్నారు అక్కడి స్థానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి: