కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. వివాహ వేడుకలకు, ఫంక్షన్లకు వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. కరోనా వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
 
కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, వాల్వ్ రీప్లేస్మెంట్/రిపెయిర్ లాంటి సర్జరీలు చేయించుకోవాలనుకునే వాళ్లు సైతం వైరస్ వల్ల భయాందోళనకు గురవుతున్నారు. అయితే నిపుణులు మాత్రం సరైన సమయంలో సర్జరీ చేయకపోయినా ప్రాణాంతకమని అంటున్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోయినా, సర్జరీ జరగకపోయినా ఆరోగ్యం మరింత దిగజారే అవకాశం ఉందని అందువల్ల వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి కరోనా వైరస్ పైనే ఉందని దీంతో ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని హార్ట్ ప్రాబ్లమ్స్‌తో చనిపోతున్న వారి శాతం బాగా పెరిగిందని... కరోనా సోకుతుందనే భయంతో సకాలంలో ఆస్పత్రికి వెళ్లని వాళ్లే వైరస్ బారిన పడుతున్నరని వైద్యులు చెబుతున్నారు. అవసరమైన వైద్య సహాయం పొందకపోవటం కరోనా సోకుతుందేమో అనే భయం కంటే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
 
చాలా ఆస్పత్రుల్లో వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ టైమ్ లో ఆస్పత్రుల్లో పేషెంట్లు, వారి సహాయకులు, ఆస్పత్రి సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలి. ఆస్పత్రికి వెళ్లే సమయంలో హ్యాండ్ శానిటైజర్ సహాయంతో తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆస్పత్రి నిర్వాహకులు ఎక్కువ మంది తిరిగే ప్రదేశాలని రెగ్యులర్ గా క్లీన్ చేయడం, డిసింఫెక్ట్ చేయడం తప్పనిసరి. పేషెంట్స్ సంగతి చూసే మెడికల్ సిబ్బంది తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలి. మరోవైపు దేశంలో గత 8 రోజుల నుంచి ప్రతిరోజూ 50,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమయ్యే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: