బీహార్ ఎన్నికల్లో ఘనత సాధించాం అని, ఇప్పుడు జీహెచ్ఎంసి లో ప్రజాదరణ పొందాము అని బిజెపి సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు కి అడ్డాగా ఉన్న దుబ్బాక కూడా విజయం సాధించాము అని చెప్పారు. సర్వేలు ఎన్ని చెప్పినా భాజపా పై ప్రజలకు నమ్మకం ఉందని స్పష్టమైంది అని ఆయన తెలిపారు. యాభై వేల పెన్షన్లు ఉన్నాయని...వారు ఓటేసినా గెలుస్తామని హరీష్ రావు విర్రవీగారు అని... చిన్న వర్షం వచ్చినా గుంతలు వరదలు వస్తున్నాయి అన్నారు.

ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సరిగా నిర్వర్తించలేదు అని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని మండిపడ్డారు. తెరాస , మజ్లీస్ పార్టీ మోసం పూరిత రాజకీయాలు చేస్తున్నాయి అని విమర్శలు చేసారు. ప్రజలు సరైన సమాధానం చెప్పారు అన్నారు. తెరాస పార్టీ లో గెలిచిన వాళ్ళు భాజపా, కాంగ్రెస్ ల పై గెలిచారు కానీ మజ్లీస్ పై గెలవలేదు అన్నారు. రైతులు, జర్నలిస్టలకు, ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం ఈ ఎన్నికల్లో అర్థం అయింది అని వ్యాఖ్యానించారు. 2023 లో భాజపా తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు.

తెరాసకు ప్రత్యమ్నాయం భాజాపా నే అని ఆయన అన్నారు. టీ ఆర్ఎస్ లో అంతర్మథనం మొదలయ్యిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం మాదే గల్లీ ఎన్నికలని హైదరాబాద్ ప్రజలను అవమానపరిచారని, ఎన్నికల్లో అధికార పార్టీకి కొమ్ముకాసిన వారు పర్యావసానాలు ఎదుర్కోక తప్పదని ఆయన వెల్లడించారు. సంవత్సర కాలంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చినా సిద్ధమే అని ఆయన సవాల్ చేసారు. హిందుత్వం అనేది మా ఎజెండా..జీవన విధానం అన్నారు. మేమేసిన చార్జ్ షీట్ ను నమ్మి  ప్రజలు ఓటేశారు అని ఆయన వెల్లడించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా?  అని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి  టెంపుల్ హైదరాబాద్లో  అంతర్భాగం కాదా? అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: