అత్యాచారం విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అంగప్రవేశం జరగకపోయినా.. అత్యాచారంగానే  పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. 11ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో అంగప్రవేశం జరగనందున దాన్ని రేప్ గా పరిగణించరాదని నిందితుడు కోరాడు. ఇందుకు స్త్రీ ఏ అవయవంలోనైనా చొచ్చుకుపోవడానికి చేసే ప్రయత్నాన్ని కూడా అత్యాచారంగానే పరిగణిస్తామని కోర్టు తెలిపింది. నిందితుడికి పడిన శిక్షను సమర్థించింది. 

1997లో ఒక ఘోరం జరిగిపోయింది. రాధాకృష్ణ నగేశ్ అనే వ్యక్తి తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీలో బాల్ బాయ్ గా పనిచేసేవాడు. అంతమంచి యూనివర్సిటీలో పనిచేస్తున్న అతనికి పాడుబుద్ది పుట్టింది. ఎవరికైనా చిన్నపిల్లలను చూస్తే వారితో ఆడుకోవాలని.. వారికో చాక్ లెట్ కొనిపెట్టాలని ఉంటుంది. వారు మాట్లాడే మాటలను వింటూ ఆనందపడిపోవాలని ఉంటుంది. కానీ ఆ నగేశ్ కు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. కామంతో రగిలిపోయాడు. ఎలాగైనా అనుభవించాలని పక్కా ప్లాన్ వేశాడు.  

తనకు దగ్గరలో కనిపించిన 11ఏళ్ల బాలికపై కన్నేశాడు. కామవాంఛ తీర్చుకోవడమే ధ్యేయంగా.. దానికి ఒక ప్రణాళిక వేశాడు. ఆ 11ఏళ్ల బాలికకు గాజులు ఇస్తానని ఆశచూపాడు. దీంతో ఆనందపడిపోయిన బాలిక.. అతడి దుర్మార్గాన్ని తెలియక ఆ నీచుడి వెంట వెళ్లిపోయింది. దీంతో ఆ కామాంధుడు ఆ చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. ఆ దుర్మార్గుడు చేసే వికృత చేష్టలు ఆ చిన్నారికి తెలియక కేకలు వేసే ప్రయత్నం చేసింది. దీంతో ఆ పాపను ఆ కామాంధుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. బలవంతంగా అనుభవించాడు. అయితే రాధాకృష్ణ నగేశ్  చేసిన ఈ నీచపు పని బట్టబయలైంది. చేసిన విషయం అంతా.. చిన్నారి పెద్దలకు చెప్పడంతో.. నిందితుని కటకటాల వెనక్కి నెట్టారు. నేరాన్ని అయితే ఒప్పుకున్నాడు గానీ.. అంగప్రవేశం జరుగలేదని న్యాయస్థానంలో వాదించాడు.  అయితే అంగప్రవేశం చేసే ప్రయత్నం విఫలమైనా అది అత్యాచారం కిందకే వస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

 




మరింత సమాచారం తెలుసుకోండి: