ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యే అవకాశాలు ఉండటం మూడో వేవ్ వచ్చే సూచనలు ఉన్న నేపధ్యంలో అధికారులు అలెర్ట్ గా ఉంటున్నారు. స్కూల్స్ ఓపెన్ చేయడం ఇప్పుడు సవాల్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసులను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టారు. నాలుగు జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ కి ఎక్కువగా సూచనలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పరీక్షల వేళ ఉపాధ్యాయులు, విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి అని వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ సూచించారు.

కొవిడ్ నియమ నిబంధనల్ని తప్పనిసరి పాటించాలని ఆయన మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా  స్కూళ్లు, కళాశాలల్లో పరీక్షలు కొనసాగుతున్నందున ప్రోటోకాల్ నిబంధనల్ని పాటించాలి అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ జాగ్రత్త వహించాలి అని ఆయన సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ చాలా అలెర్ట్ గా ఉందని అన్నారు. పరీక్ష హాలు, కాలేజ్/స్కూల్ క్యాంపస్లోనూ, ఇతర బహిరంగ ప్రదేశాలలోనూ ప్రతి విద్యార్థీ తన ముక్కు, నోరు మూసి వుండే విధంగా మాస్క్ లు ధరించాలని హెచ్చరించారు.

 ఇతరులనుండి కనీసం ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి అన్నారు. చేతులను తరచూ శుభ్రపర్చుకోవాలి అని ఆయన సూచించారు. పరీక్షహాలులోకి ప్రవేశించే సమయంలోనూ, నిష్క్రమించే సమయంలోనూ విద్యార్థులు ఇతరుల నుండి సురక్షిత భౌతక దూరాన్ని పాటించాలి అని ఆయన హెచ్చరించారు.  కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలను విద్యార్థులు సమగ్రంగా అవగాహన చేసుకుని పాటించే విధంగా తల్లిదండ్రులు వారిని చైతన్యవంతం చేయాలి అని సూచించారు.  కోవిడ్  నిబంధనల అమలు విషయంలో ఏమాత్రమూ రాజీ పడకుండా స్కూల్ /కాలేజీ యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని ఆయన సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap