విశాఖలో భూకుంభ కోణం విషయం ఈ నాటిది కాదు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఈ అంశం వెలుగు చూసింది. తెలుగు దేశం నేతలు అడ్డగోలుగా ఆక్రమణలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో విశాఖకు చెందిన టీడీపీ మంత్రే స్వయంగా మా పార్టీ నేతలే భూ కబ్జాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన విషయం మర్చిపోలేం. కబ్జాదారులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేనే భయం వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనమైంది.


అప్పట్లో నటుడు శివాజీ కూడా చంద్రబాబును ఈ వియమమై ఎన్నికల ముందు హెచ్చరించారు కూడా. అయినా గత ప్రభుత్వం పెద్దగా సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ భూస్కామ్ పై సిట్ ఏర్పాటు చేసిన మూడు రోజుల్లోనే 300కు పైగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంటే గత ప్రభుత్వం హయాంలో ఏ స్థాయిలో భూ ఆక్రమణలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. భూ అక్రమాలపై సామాన్యులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.


వీటిలో ప్రధానంగా ప్రభుత్వ భూములను ప్రభుత్వేతర భూములుగా మార్పు చేసిన కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. వేలాది ఎకరాల రికార్డులు మాయం అవ్వడం, దానికి హుద్ హుద్ తుఫాను కారణం అని అధికారులతో చెప్పించారు. తాజాగా ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయట.


విశాఖలో గీతం వర్సిటీ సమీపంలో ఉన్న34ఎరాల భూములను కేటాయించమని ప్రభుత్వాన్ని కోరిందట. రాష్ట్ర విభజనకు ఆమోదం జరగడం, రాజధాని గురించి స్పష్టత లేకపోవడంతో భూ కేటాయింపుల కమిటీ గీతం అభ్యర్థనను తిరస్కరించిందట. అయితే అదే భూమిని ప్రభుత్వ సంస్థలకు కేటాయింపులు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే ప్రభుత్వ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు రద్దు చేసేసారు. భూ కేటాయింపుల విషయంలో మార్గదర్శకాల ప్రకారం చూస్తే ప్రభుత్వ విభాగాలకు ప్రాధాన్యతనివ్వాలి. కానీ తన బినామీలైన ప్రైవేటు వ్యక్తులకు మేలు చేయడానికే చంద్రబాబు తొలి ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: