కరోనా వైరస్  ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వినిపిస్తోంది. ప్రస్తుతం ఏదేశంలో చూసినా ఈ వైరస్ భయమే కనిపిస్తోంది. చైనాలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని 57 దేశాలకు వ్యాప్తి చెంది ఎంతో మందిని బలి తీసుకుంటున్నది . ఇప్పటికే చైనా దేశంలో ఈ వైరస్ బారినపడి 3,200 మంది చనిపోగా 80 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వ్యాధి బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇక ఈ వైరస్ కు  సరైన వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో వైరస్ సోకితే ప్రాణాలు పోవడం ఖాయం గా మారిపోయింది. ఇక ఈ వైరస్  ప్రపంచ దేశాలకు కూడా శరవేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్. 

 

 

 అయితే ప్రస్తుతం చైనా దేశంలో గతంతో పోలిస్తే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ జాతీయ ఆరోగ్య మిషన్ సమీక్ష నిర్వహించనుంది. ఈ సందర్భంగా కరోనా  వ్యాధి సోకి చికిత్స పొంది కోలుకున్న వారు మరోసారి ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడే అవకాశం ఉందా అనే విషయంపై అక్కడి అధికారులు ముఖ్యంగా చర్చించారు. అయితే దీనిపై అటు చైనా మీడియా కూడా ఓ కథను వెలువరించింది... కరోనా  వైరస్ నుంచి కోలుకున్న వారు కూడా మరోసారి ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడే అవకాశం లేకపోలేదు అంటూ జాతీయ ఆరోగ్య మిషన్ భావిస్తున్నట్లు సమాచారం. 

 

 

 కరోనా  వైరస్ బారి నుంచి కోలుకున్న వారి బాడీలో కరోనా వైరస్ ను ఎదుర్కునే  ప్రోటీన్లు  పెరిగినప్పటికీ... అవి శరీరంలో ఎక్కువ రోజులు కొనసాగలేవు  అంటూ అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి కరోనా  వైరస్ బారిన పడి చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న వారు కూడా మరోసారి జాగ్రత్తలు పాటించకపోతే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడే అవకాశం ఉందని  అంచనా వేస్తున్నారు. అయితే ఇలాగే జరుగుతుంది అని మాత్రం వారు సాధికారికంగా చెప్పలేకపోతున్నారు. కరోనా  వైరస్ పై  వారికి పూర్తి అవగాహన లేకపోవడంతో.. కరోనా నుండి  కోలుకుని  శరీరంలో రోగ నిరోధక శక్తి ఎలా స్పందిస్తుంది అన్నది కచ్చితంగా చెప్పలేము  అని చెబుతున్నారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: